చోప్రా స్థానంలో యశ్‌వీర్
ABN , Publish Date - Sep 04 , 2026 | 01:55 AM
గాయపడిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా స్థానంలో యశ్‌వీర్ సింగ్‌ను ఆసియాడ్‌కు ఎంపిక చేశారు. జపాన్‌లో ఈ నెల 19 నుంచి జరిగే ఆసియా క్రీడలకు సంబంధించి ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో పాల్గొనే 77 మంది సభ్యుల బృందాన్ని భారత అథ్లెటిక్స్ సమాఖ్య గురువారం ప్రకటించింది.
లుథియానా: గాయపడిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా స్థానంలో యశ్‌వీర్ సింగ్‌ను ఆసియాడ్‌కు ఎంపిక చేశారు. జపాన్‌లో ఈ నెల 19 నుంచి జరిగే ఆసియా క్రీడలకు సంబంధించి ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో పాల్గొనే 77 మంది సభ్యుల బృందాన్ని భారత అథ్లెటిక్స్ సమాఖ్య గురువారం ప్రకటించింది. డోపింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న రన్నర్ అభిషేక్ పాల్, గాయపడిన హర్డ్‌లర్ తేజస్ సిర్సేను ఈ జాబితా నుంచి తొలగించారు. తాజాగా 200 మీ. రన్నర్ హరిత భద్ర, పోల్‌వాల్టర్ సింధు శ్రీ, ట్రిపుల్ జంపర్ ఆషా, డిస్కస్ త్రోయర్ సన్యా, హ్యామర్ త్రోయర్ ప్రవీణ్‌ను ఎంపిక చేశారు.
ఇవి కూడా చదవండి:
కేరళ సీఎంతో రొనాల్డ్ సోదరి భేటీ.. వీడియో వైరల్
సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు.. నలుగురి బెయిల్ పిటిషన్ల డిస్మిస్