ఎర్రగడ్డల ధరలు పైపైకే..!
ABN , Publish Date - Sep 03 , 2026 | 01:44 PM
ఎర్రగడ్డల ధరలు రోజు రోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో ధర రూ.70కి చేరుకుంది.
కిలో రూ.70కి విక్రయం
తిరుపతి: ఎర్రగడ్డల ధరలు రోజు రోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో ధర రూ.70కి చేరుకుంది. గత నెలతో పోలిస్తే కిలోపై రూ.30 వరకు పెరిగింది. ఉత్తరాంధ్రలో ఇటీవల భారీ వర్షాలు కురవడంతో పాటు దిగుబడి తగ్గిపోవడం ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని వ్యాపారులు చెబుతున్నారు. తిరుపతి మార్కెట్‌కు రోజూ ఐదు నుంచి ఏడు లారీల సరకు వచ్చేదని.. పది రోజులుగా మూడు నుంచి నాలుగు లారీల సరుకు రావడమే కష్టంగా ఉందన్నారు.మరోవైపు ఎల్‌నినో కారణంగా చాలా ప్రాంతాల్లో పంట సాగు సరిగా లేకపోవడమూ మరో కారణమని తెలిపారు.
హోటళ్లలో ఎర్రగడ్డల వంటకాలకు బ్రేక్
ధర భారీగా పెరగడంతో ఎర్రగడ్డల వంటకాలకు కొన్ని హోటళ్లలో బ్రేక్ పడింది. కొన్నిచోట్ల ఎర్రగడ్డల ఆధారిత వంటకాలను తాత్కాలికంగా మెనూ నుంచి తొలగించారు. బుధవారం తిరుపతిలోని పలు హోటళ్లలో ఆనియన్ దోసె పూర్తిగా కనిపించలేదు. సమోసా తయారీలోనూ క్యారెట్, క్యాబేజీ వాడుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయం ఖాయం
కొత్త పింఛన్లు, స్థానిక ఎన్నికలు.. మంత్రులతో లోకేశ్ కీలక చర్చ
Read Latest AP News And Telangana News And International News And Telugu News