భారత్‌లో ఏఐ వ్యవస్థ చూస్తే సంతోషం కలుగుతోంది: ఎన్విడియా సీఈఓ
ABN , Publish Date - Sep 03 , 2026 | 12:58 PM
ఏఐ రంగంలో ముందువరుసలో నిలిచేందుకు భారత త్వరపడాలని ప్రముఖ మైక్రోప్రాసెసర్‌ల తయారీ సంస్థ ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ సూచించారు.
ఇంటర్నెట్ డెస్క్: ఏఐ రంగంలో ముందువరుసలో నిలిచేందుకు భారత్ త్వరపడాలని, వేగం పెంచాలని మైక్రోప్రాసెసర్‌ల తయారీ సంస్థ ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ సూచించారు. బలమైన ఐటీ రంగం ఉన్న భారత్‌కు స్థానికంగా ఏఐ ఆర్థికవ్యవస్థ రూపొందించుకునే అవకాశం ఉందని అన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏఐ రంగంలో తమకంటూ స్థానాన్ని పదిల పరుచుకునేందుకు దేశాలు త్వరపడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఏఐ ఒక కొత్త సాంకేతిక వేదికగా రూపుదిద్దుకుంటోందని చెప్పారు.
ఐటీ రంగంలో భారత్ ఇప్పటికే ముందువరుసలో ఉందని అన్నారు. అయితే, ఏఐ ఓ కొత్త సాంకేతిక వేదిక అని చెప్పారు. ఏఐ రంగాన్ని అందింపుచుకుంటున్న భారతీయ సంస్థలను చూస్తుంటే సంతోషంగా ఉందని కూడా అన్నారు. అయితే, ఏఐ రంగంలో ముందువరుసలో ఉండాలంటే మాత్రం స్పీడు పెంచకతప్పదని స్పష్టం చేశారు.
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీర్స్ మెడల్ ఆఫ్ ఆనర్‌ను ఇటీవల జెన్సన్ హువాంగ్ స్వీకరించారు. జీపీయూ రంగం అభివృద్ధిలో పాత్రకు గాను ఆయనను ఈ అవార్డు వరించింది. ఈ సందర్భంగా అవార్డు ప్రదాన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నేటి ఏఐ జమానాలోనూ ఇంజినీరింగ్‌యే ఉన్నతమైన కోర్సు అని వ్యాఖ్యానించారు. ఏఐ రాకతో టెక్నికల్ వర్క్ తీరుతెన్నులు మారిపోతున్నప్పటికీ తన దృష్టిలో ఇంజినీరింగ్ ఇప్పటికీ ముఖ్యమేనని చెప్పారు.
ఈ వార్తలనూ చదవండి:
మస్క్-ఆల్ట్‌మన్ వివాదం మరింత ముదురుతోందా.. కర్సర్‌తో డీల్‌ను ఆపనున్న ఓపెన్ ఏఐ..
11 రోజుల్లో 30 లక్షల అభ్యంతరకర కంటెంట్! 'గ్రోక్'పై కేసు నమోదు