మస్క్-ఆల్ట్‌మన్ వివాదం మరింత ముదురుతోందా.. కర్సర్‌తో డీల్‌ను ఆపనున్న ఓపెన్ ఏఐ..
ABN , Publish Date - Aug 29 , 2026 | 11:50 AM
టెక్ ప్రపంచంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏఐ కోడింగ్ ప్లాట్‌ఫామ్ కర్సర్‌కు తమ ఏఐ మోడళ్లను అందించే ఒప్పందాన్ని ముగించాలని ఓపెన్ ఏఐ నిర్ణయించింది. ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ తాజాగా కర్సర్ సంస్థను సొంతం చేసుకోవడం వల్లే ఓపెన్ ఏఐ ఈ నిర్ణయం తీసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: టెక్ ప్రపంచంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏఐ కోడింగ్ ప్లాట్‌ఫామ్ కర్సర్‌కు తమ ఏఐ మోడళ్లను అందించే ఒప్పందాన్ని ముగించాలని ఓపెన్ ఏఐ నిర్ణయించింది. ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ తాజాగా కర్సర్ సంస్థను సొంతం చేసుకోవడం వల్లే ఓపెన్ ఏఐ ఈ నిర్ణయం తీసుకుంది. మస్క్, ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్ మధ్య ఇప్పటికే కొనసాగుతున్న వివాదాన్ని ఈ నిర్ణయం మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉంది (OpenAI Cursor Partnership).
కర్సర్‌కు ఏఐ మోడళ్లను అందించే ఒప్పందాన్ని 2026 నవంబర్ 12న ముగించాలని ప్రతిపాదించినట్లు ఓపెన్ ఏఐ వెల్లడించింది. అప్పటి వరకు కర్సర్ వినియోగదారులు ఓపెన్ ఏఐ మోడళ్లను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో విడుదల చేయబోయే కొత్త ఓపెన్ ఏఐ మోడళ్లను కర్సర్‌కు అందించబోమని సంస్థ స్పష్టం చేసింది. స్పేస్ ఎక్స్ తమ టెక్నాలజీని తమ నిబంధనలకు అనుగుణంగా ఉపయోగిస్తుందనే నమ్మకం లేదని ఓపెన్ ఏఐ పేర్కొంది. ఎలాన్ మస్క్‌కు చెందిన సంస్థలతో గతంలో ఒప్పంద ఉల్లంఘనలకు సంబంధించిన అనుభవాలే ఈ నిర్ణయానికి కారణమని తెలిపింది (OpenAI SpaceX Cursor).
కర్సర్ మాతృసంస్థ అయిన ఎనీస్పియర్‌ను బిలియన్ డాలర్లకు స్పేస్ ఎక్స్ కొనుగోలు చేసింది. ఈ కొనుగోలు ప్రక్రియ ఆగస్టులో పూర్తయింది. స్పేస్ ఎక్స్‌లో భాగమైన తర్వాత కర్సర్‌కు భారీ కంప్యూటింగ్ సామర్థ్యం అందుబాటులోకి వస్తుందని ఆ సంస్థ తెలిపింది. కర్సర్ అనేది ఏఐ ఆధారిత కోడింగ్ టూల్ సంస్థ. డెవలపర్లు కోడ్ రాయడం, సవరించడం, సమస్యలను పరిష్కరించడం వంటి పనుల్లో ఏఐ మోడళ్లను ఉపయోగించుకునేందుకు ఇది సహాయపడుతుంది (Cursor SpaceX Acquisition).
ఎలాన్ మస్క్, సామ్ ఆల్ట్‌మన్ మధ్య విభేదాలు చాలా కాలంగా కొనసాగుతున్నాయి (Elon Musk Sam Altman Clash). ఓపెన్ ఏఐపై మస్క్ గతంలో న్యాయపరమైన పోరాటం కూడా చేశారు. ఓపెన్ ఏఐ తన అసలు లాభాపేక్షలేని లక్ష్యం నుంచి తప్పిపోయిందని మస్క్ గతంలో ఆరోపించారు. కాగా, మస్క్ తమ సంస్థపై నియంత్రణ సాధించేందుకు ప్రయత్నించారని ఓపెన్ ఏఐ వాదించింది.
ఇవి కూడా చదవండి..
ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద ఆయిల్ డీల్.. వెనెజువెలాతో ఒప్పందంపై ట్రంప్ ప్రకటన..
స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..