‘ఇంపాక్ట్’గా ధోనీ విముఖత
ABN , Publish Date - Sep 04 , 2026 | 02:08 AM
ఇంపాక్ట్ ప్లేయర్‌గా కొనసాగడానికి ధోనీ సుముఖంగా లేడని చెన్నై సూపర్ కింగ్స్ మాజీ బ్యాటర్ సుబ్రమణియం బద్రీనాథ్ చెప్పాడు. ఐపీఎల్‌లో తాను ఫుల్‌టైమ్ ఆటగాడిగానే కొనసాగాలనుకొంటున్నట్టు ధోనీ చెప్పాడన్నాడు.
చెన్నై మాజీ బ్యాటర్ బద్రీనాథ్
న్యూఢిల్లీ: ఇంపాక్ట్ ప్లేయర్‌గా కొనసాగడానికి ధోనీ సుముఖంగా లేడని చెన్నై సూపర్ కింగ్స్ మాజీ బ్యాటర్ సుబ్రమణియం బద్రీనాథ్ చెప్పాడు. ఐపీఎల్‌లో తాను ఫుల్‌టైమ్ ఆటగాడిగానే కొనసాగాలనుకొంటున్నట్టు ధోనీ చెప్పాడన్నాడు. ఫిట్‌నెస్‌లేమి కారణంగా గత సీజన్‌లో మహీ కనీసం ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ‘ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడబోనని ధోనీ స్వయంగా చెప్పాడు. ఫుల్‌టైమ్ కీపర్‌గా కొనసాగాలనుకొంటున్నాడు. అంటే, 20 ఓవర్లపాటు మైదానంలో ఫీల్డింగ్ చేయాలనుకొంటున్నాడ’ని బద్రీనాథ్ తెలిపాడు.
ఇవి కూడా చదవండి:
కేరళ సీఎంతో రొనాల్డ్ సోదరి భేటీ.. వీడియో వైరల్
సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు.. నలుగురి బెయిల్ పిటిషన్ల డిస్మిస్