Share News

విజయవాడ డెంటల్ కాలేజీలో రూ.60లక్షలతో అభివృద్ధి పనులు.. ప్రారంభించిన ఎంపీ చిన్ని

ABN , Publish Date - Sep 03 , 2026 | 11:47 AM

విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలలో రూ.60 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన డెంటల్ చైర్స్, సీసీ రోడ్, పార్కింగ్ షెడ్, కాంపౌండ్ వాల్‌ను ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఈరోజు ప్రారంభించారు.

విజయవాడ డెంటల్ కాలేజీలో రూ.60లక్షలతో అభివృద్ధి పనులు.. ప్రారంభించిన ఎంపీ చిన్ని
Vijayawada Dental Colleg

విజయవాడ, సెప్టెంబర్ 3: నగరంలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలలో రూ.60 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన డెంటల్ చైర్స్, సీసీ రోడ్, పార్కింగ్ షెడ్, కాంపౌండ్ వాల్‌ను ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని), ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఈరోజు(గురువారం) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. డెంటల్‌ కళాశాల ఆవరణలో పలు అభివృద్ధి పనులను పూర్తి చేసినట్లు తెలిపారు. 24 బెడ్‌లు, సీసీ రోడ్‌లను ప్రారంభించామని.. 500 మందికి ప్రతిరోజూ ఓపీ ఉంటుందని చెప్పారు. మెడికల్ యూనివర్శిటీలో కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ఆర్ఓ ఫ్లాంట్, పేషెంట్‌ల కొరకు షెడ్‌లు కూడా ఏర్పాటు చేస్తామన్నారు. విద్యార్థుల కోసం హాస్టల్ సౌకర్యాన్ని కూడా తీసుకొస్తామని ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడించారు.


భవిష్యత్తులో మరిన్ని సౌకర్యాలు పెంచుతాం: గద్దె రామ్మోహన్

ఇక్కడ డెంటల్ కళాశాలకు ఎంతో గొప్ప చరిత్ర ఉందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. 2014కు ముందు మోకాళ్ల లోతు నీరు ఉండేదని.. ఆ తరువాత సీసీ రోడ్లు, ఇతర సౌకర్యాలు కల్పించామని తెలిపారు. ఇప్పుడు అరవై లక్షలతో మరిన్ని సేవలు అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. భవిష్యత్తులో కూడా విద్యార్థులు, ప్రజలకు అవసరమైన సౌకర్యాలు పెంచుతామన్నారు. భవిష్యత్తులో ఐదు వేల మంది ఓపీకి రావాలని భావిస్తున్నామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

ఆదాయానికి మంచి ఆస్తుల కేసు.. టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్

క్రెడిట్ చోరీ వ్యాధికి మొదటి రోగి జగన్: మంత్రి గుమ్మడి సంధ్యారాణి

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 03 , 2026 | 12:00 PM