Share News

విక్టర్‌కు శ్రీకాంత్‌ షాక్‌

ABN , Publish Date - Sep 04 , 2026 | 02:05 AM

వెటరన్‌ షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌ చైనా మాస్టర్స్‌ సూపర్‌ 750 టోర్నీలో క్వార్టర్‌ ఫైనల్‌కు చేరాడు. ఈక్రమంలో వరల్డ్‌ నెం.9 విక్టర్‌ లాయ్‌కి షాకిచ్చాడు. స్టార్‌ డబుల్స్‌ ద్వయం సాత్విక్‌/చిరాగ్‌ కూడా ముందంజ వేయగా..వర్ధమాన తార తన్వీశర్మ రెండో రౌండ్‌లో ఓటమి చవిచూసింది.

విక్టర్‌కు శ్రీకాంత్‌ షాక్‌

క్వార్టర్స్‌లో సాత్విక్‌ జోడీ

తన్వీ ఓటమి జూచైనా మాస్టర్స్‌

షెన్‌జెన్‌ (చైనా): వెటరన్‌ షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌ చైనా మాస్టర్స్‌ సూపర్‌ 750 టోర్నీలో క్వార్టర్‌ ఫైనల్‌కు చేరాడు. ఈక్రమంలో వరల్డ్‌ నెం.9 విక్టర్‌ లాయ్‌కి షాకిచ్చాడు. స్టార్‌ డబుల్స్‌ ద్వయం సాత్విక్‌/చిరాగ్‌ కూడా ముందంజ వేయగా..వర్ధమాన తార తన్వీశర్మ రెండో రౌండ్‌లో ఓటమి చవిచూసింది. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో 33 ఏళ్ల శ్రీకాంత్‌ 21-18, 21-19తో వరుస గేముల్లో విక్టర్‌ లాయ్‌ (కెనడా)ను ఓడించాడు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌/చిరాగ్‌ జోడీ 21-15, 22-24, 21-9తో ఫ్రెంచ్‌ సోదర ద్వయం క్రిస్టో/టోమా జూనియర్‌ పొపొవ్‌పై కష్టపడి నెగ్గి క్వార్టర్‌ఫైనల్లోకి అడుగు పెట్టింది. మహిళల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో తన్వీశర్మ 17-21, 21-18, 16-21తో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్‌ టొమొకా మియజాకి (జపాన్‌) చేతిలో పోరాడి ఓడింది. మిక్స్‌డ్‌లో ధ్రువ్‌ కపిల/తనీషా క్రాస్టో జోడీ కూడా 18-21, 18-21తో లియు కాంగ్‌/సు ఇన్‌ (తైపీ) చేతిలో ప్రీక్వార్టర్స్‌లో పరాజయం చవిచూసింది.

ఇవి కూడా చదవండి:

కేరళ సీఎంతో రొనాల్డ్ సోదరి భేటీ.. వీడియో వైరల్

సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు.. నలుగురి బెయిల్ పిటిషన్ల డిస్మిస్

Updated Date - Sep 04 , 2026 | 02:05 AM