ఈ ఏడాది తొలి విజయం.. జీఎస్ఎల్‌వీ-ఎఫ్17 మిషన్: ఇస్రో చైర్మన్ నారాయణన్
ABN , Publish Date - Sep 04 , 2026 | 07:37 AM
ఈ ఆర్థిక సంవత్సరంలో జీఎస్ఎల్‌వీ-ఎఫ్17 మిషన్ సక్సెస్ కావడం తొలి విజయమని ఇస్రో చైర్మన్ నారాయణన్ స్పష్టం చేశారు. మరో ఆరు ప్రయోగాలను నిర్వహిస్తామని తెలిపారు.
నెల్లూరు,సెప్టెంబర్ 04: ఈ ఆర్థిక సంవత్సరంలో జీఎస్ఎల్‌వీ-ఎఫ్17 మిషన్ సక్సెస్ కావడం తొలి విజయమని ఇస్రో చైర్మన్ నారాయణన్ స్పష్టం చేశారు. మరో ఆరు ప్రయోగాలను నిర్వహిస్తామని తెలిపారు. శుక్రవారం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధన కేంద్రం నుంచి శుక్రవారం జీఎస్ఎల్‌వీ-ఎఫ్17 మిషన్ విజయమైన నేపథ్యంలో ఆయన స్పందించారు. భారతదేశపు తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర 'గగన్‌యాన్'కు సంబంధించిన మొదటి ప్రయోగం త్వరలోనే నిర్వహిస్తామని ఇస్రో చైర్మన్ నారాయణన్ వెల్లడించారు.
శుక్రవారం ఉదయం ప్రయోగించిన జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్17 రాకెట్.. నిర్దేశించిన 19 నిమిషాల్లోనే శాటిలైట్ నిర్దేశిత కక్ష్యలోకి చేరింది. నిర్దేశిత సమయంలో 28,934 కిలోమీటర్లు ప్రయాణించి నిర్ణీత కక్ష్యలోకి రాకెట్ చేరింది. వాతావరణం, భూ పరిశీలనకి సంబంధించిన కీలక సమాచారాన్ని ఈ శాటిలైట్ EOS-05 అందించనుంది.
ఈ రాకెట్ విజయవంతంగా ప్రయోగించడం ద్వారా భారత సాంకేతిక నైపుణ్యం, శాస్త్రవేత్తల కృషికి ప్రతీకగా మరో చారిత్రాత్మక విజయంగా నిలిచింది. ఈ రాకెట్ విజయవంతం కావడంతో.. షార్ అంతరిక్ష కేంద్రంలోని ఉద్యోగుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. శుక్రవారం తెల్లవారుజాము 2.55 గంటలకు షార్‌లోని అంతరిక్ష కేంద్రం నుంచి ఈ రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కూకట్‌పల్లి జేఎన్టీయూ హాస్టల్‌లో విద్యార్థుల మధ్య ఘర్షణ.. పలువురికి గాయాలు
సాగర్ ఆయకట్టుకు నీరివ్వకుంటే ..14 నుంచి పాదయాత్ర
For More AP News And Telugu News