-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP and Telangana National International breaking Live Updates of 28th September 2026
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Sep 28 , 2026 | 06:45 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Sep 28, 2026 07:46 IST
రంగారెడ్డి: శంషాబాద్‌లో దారుణం
ప్రయాణికురాలిపై లైంగిక దాడికి క్యాబ్ డ్రైవర్ యత్నం
తొండుపల్లి టోల్‌ప్లాజా దగ్గర రూట్ మార్చిన డ్రైవర్
నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నం
కారు దిగి కేకలు వేసిన బాధితురాలు
రూ.60వేల నగదు ఉన్న బ్యాగ్‌తో నిందితుడు పరారీ
బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు
-
Sep 28, 2026 07:36 IST
నేడు ED కార్యాలయం ఎదుట BRS ఆధ్వర్యంలో ధర్నా
పాల్గొననున్న BRS ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు
మంత్రి పొంగులేటి ఆస్తులపై విచారణ జరపాలని డిమాండ్
-
Sep 28, 2026 07:28 IST
ధవలేశ్వరం కాటన్ బ్యారేజీ దగ్గర పెరుగుతున్న నీటిమట్టం
11.60 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం, 175 గేట్ల ఎత్తివేత
9.65 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల
కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలంలో కాజ్‌వే పైకి చేరిన వరద
పోలవరం జిల్లాలో ఉధృతంగా ప్రవహిస్తున్న శబరి గోదావరి
50 లోతట్టు గ్రామాలకు నిలిచిన రాకపోకలు
-
Sep 28, 2026 07:25 IST
ములుగు: మేడారం మినీ జాతర తేదీలు ఖరారు
2027 ఫిబ్రవరిలో సమ్మక్క-సారలమ్మ మినీ జాతర
ఫిబ్రవరి 17, 18, 19, 20 తేదీల్లో మినీ జాతర
-
Sep 28, 2026 07:24 IST
నేడు ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి
సాయంత్రం ఓ కార్యక్రమంలో పాల్గొననున్న రేవంత్ రెడ్డి
రేపు CWC సమావేశానికి హాజరుకానున్న సీఎం రేవంత్‌రెడ్డి
-
Sep 28, 2026 07:18 IST
ఉత్తరాఖండ్‌లో చిక్కుకున్న 179 మంది పర్వతారోహకులు
ఉత్తర కాశీలో చిక్కుకున్న 136 మంది పర్వతారోహకులు
బాగేశ్వర్‌లో చిక్కుకుపోయిన మరో 43 మంది
పిండారీ గ్లేషియర్ దగ్గర 23 మంది గుర్తింపు
ఖతి గ్రామం దగ్గర మరో 20 మంది పర్వతారోహకులు
పర్వతారోహకుల్లో ఆరుగురు విదేశీయులు
రెస్క్యూ ఆపరేషన్ వేగవంతం చేసిన అధికారులు
-
Sep 28, 2026 07:15 IST
భద్రాచలం దగ్గర తగ్గుతున్న గోదావరి నీటిమట్టం
భద్రాచలం దగ్గర ప్రస్తుత నీటిమట్టం 42.1 అడుగులు
8.80లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల
భారీ వర్షాలతో అధికార యంత్రాంగం అప్రమత్తం
కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
-
Sep 28, 2026 07:11 IST
హైదరాబాద్: SIRపై EC తీరుకు నిరసనగా నేడు టీకాంగ్రెస్ ర్యాలీ
నెక్లెస్ రోడ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం దగ్గర నిరసన
ఇందిరాగాంధీ విగ్రహం నుంచి EC ఆఫీస్ వరకు ర్యాలీ
CEC జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్
-
Sep 28, 2026 07:05 IST
నేడు మంగళగిరిలో మంత్రి నారా లోకేశ్ పర్యటన
కుంచనపల్లిలో మరో 372 మందికి పట్టాల పంపిణీ
మన ఇల్లు-మన లోకేశ్ పేరుతో ఇప్పటివరకు 5,636 మందికి భూ పట్టాల పంపిణీ
-
Sep 28, 2026 07:02 IST
హరియాణా: ఫరీదాబాద్‌లో విషాదం
బోరుబావిలో పడి మూడేళ్ల చిన్నారి నేహా మృతి
200 అడుగుల బోరుబావిలో పడిన నేహా
తలకిందులుగా నీటిలో పడటంతోనే నేహా మృతి చెందినట్టు సమాచారం
సుమారు 10 గంటలకు పైగా శ్రమించి బయటకు తీసిన NDRF
-
Sep 28, 2026 06:56 IST
తమిళనాడులో నేడు కీలక పథకం ప్రారంభం
'మేనమామ బంగారు ఉంగరం కానుక' పథకం ప్రారంభం
మదురైలో పథకాన్ని ప్రారంభించనున్న సీఎం విజయ్
-
Sep 28, 2026 06:56 IST
ఆసియా గేమ్స్: ఉ.10:30కు భారత్-అఫ్గానిస్థాన్ మ్యాచ్
డ్రా ప్రకారం నేరుగా క్వార్టర్ ఫైనల్‌కు భారత్
-
Sep 28, 2026 06:50 IST
నేడు వనపర్తి జిల్లాలో మంత్రులు పొంగులేటి, జూపల్లి పర్యటన
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్న మంత్రులు
ఉమ్మడి జిల్లా కలెక్టర్లతో భేటీకానున్న మంత్రులు
గృహనిర్మాణం, రెవెన్యూ శాఖలపై సమగ్ర సమీక్ష
-
Sep 28, 2026 06:49 IST
అమరావతి: నేడు కోఆర్డినేషన్ కమిటీతో పవన్ కల్యాణ్ భేటీ
స్థానిక ఎన్నికలపై ఏర్పాటు చేసిన ఫైవ్ మెన్ కమిటీ
-
Sep 28, 2026 06:48 IST
నేడు బహదూర్‌గూడ రైతులతో కేటీఆర్ భేటీ
బుల్లెట్ రైలు ప్రాజెక్టులో భాగంగా భూములు కోల్పోతున్న రైతులతో మాట్లాడనున్న కేటీఆర్
-
Sep 28, 2026 06:48 IST
హైదరాబాద్‌లో ప్రస్తుతం బంగారం ధరలు ఇవీ
24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,52,670
22 క్యారెట్ల బంగారం ధర రూ.1,39,994
కిలో వెండి ధర రూ.2,49,900
Tags
- #Telugu News
- #AP News
- #TG News
- #Andhra Pradesh
- #Telangana
- #AP CM
- #Telangana CM
- #AP Politics
- #TG Politics
- #Andhra Pradesh Politics
- #Telangana Politics
- #Chandrababu
- #Chandrababu Naidu
- #Revanth
- #Revanth Reddy
- #AP Cabinet
- #TG Cabinet Meet
- #National News
- #International News
- #Latest News
- #Breaking
- #ABN
- #ABN Andhrajyothy