POTM అవార్డు తీసుకోవడం ఇబ్బందిగా అనిపించింది: కుల్‌దీప్ యాదవ్
ABN , Publish Date - Sep 28 , 2026 | 07:37 AM
వెస్టిండీస్‌పై తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. బౌలింగ్‌లో అద్భుతంగా రాణించిన కుల్‌దీప్ యాదవ్(4/40)కే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. దీనిపై కుల్‌దీప్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: వెస్టిండీస్‌పై తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. 296 పరుగుల లక్ష్యాన్ని 41.4 ఓవర్లలోనే ఛేదించింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్(110), స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(139*) సెంచరీలతో చెలరేగారు. అయితే తొలుత బౌలింగ్‌లో అద్భుతంగా రాణించిన కుల్‌దీప్ యాదవ్(4/40)కే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. దీనిపై కుల్‌దీప్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. గిల్, విరాట్ సెంచరీలు చూశాక.. ఈ అవార్డు తాను తీసుకోవడం ఇబ్బందికరంగా అనిపించిందని వెల్లడించాడు.
‘శుభ్‌మన్, విరాట్ భాయ్ సెంచరీలతో అదరగొట్టారు. వారి బ్యాటింగ్ చూడటానికి రెండు కళ్లు సరిపోలేదు. అద్భుతంగా ఆడారు. ముఖ్యంగా విరాట్ భాయ్ బ్యాటింగ్ చూస్తే ఇది చాలా ప్రత్యేకమైన ఇన్నింగ్స్ అనిపించింది. ఇలాంటి ప్రదర్శన చూసిన తర్వాత ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు నాకు రావడం ఆశ్చర్యంగా అనిపించింది. ఈ అవార్డు నేను తీసుకోవడం కూడా నాకు చాలా ఇబ్బందికరంగా అనిపిస్తోంది. పలు రికార్డులు, అద్భుతమైన స్ట్రైక్ రేట్, బౌండరీలు, సిక్సర్లు, వికెట్ల మధ్య పరుగెత్తడం.. విరాట్ భాయ్ ప్రతి కదలిక అద్భుతంగా అనిపించింది’ అని కుల్‌దీప్ యాదవ్ మ్యాచ్ అనంతరం వెల్లడించాడు.
ఇవి కూడా చదవండి:
చెస్ ఒలింపియాడ్: భారత్ ఖాతాలో రెండు పతకాలు
ఆసియా క్రీడలు: లాంగ్ జంప్‌లో రజతం.. రన్నింగ్, డెకథ్లాన్‌లో కాంస్యాలు