విరాట్, గిల్ శతక్కొట్టారు
ABN , Publish Date - Sep 28 , 2026 | 06:00 AM
వెస్టిండీస్‌తో ఆరంభమైన మూడు వన్డేల సిరీ్‌సలో భారత జట్టు ఘనంగా బోణీ చేసింది. బౌలర్లు విఫలమైన చోట స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (88 బంతుల్లో 10 ఫోర్లు, 9 సిక్సర్లతో 139 నాటౌట్), కెప్టెన్ గిల్ (108 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్స్‌తో 110) సెంచరీలతో...
8 వికెట్లతో భారత్ గెలుపు
జస్టిన్ గ్రీవ్స్ (101)
విండీస్‌తో తొలి వన్డే
ఛేజింగ్ రారాజు విరాట్ కోహ్లీ తనలో ఏమాత్రం సత్తా తగ్గలేదని నిరూపించాడు. కళ్లు చెదిరే ఇన్నింగ్స్‌తో కెరీర్‌లో 55వ సెంచరీని అందుకోగా.. అటు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సైతం తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ మూడంకెల స్కోరందుకున్నాడు. ఈ ఇద్దరి జోరుకు విండీస్ సాధించిన భారీ స్కోరు మరో 50 బంతులుండగానే చిన్నబోయింది.
తిరువనంతపురం: వెస్టిండీస్‌తో ఆరంభమైన మూడు వన్డేల సిరీ్‌సలో భారత జట్టు ఘనంగా బోణీ చేసింది. బౌలర్లు విఫలమైన చోట స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (88 బంతుల్లో 10 ఫోర్లు, 9 సిక్సర్లతో 139 నాటౌట్), కెప్టెన్ గిల్ (108 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్స్‌తో 110) సెంచరీలతో కదం తొక్కారు. దీంతో ఆదివారం జరిగిన ఈ తొలి వన్డేలో భారత్ 8 వికెట్ల తేడాతో గెలిచి సిరీ్‌సలో 1-0 ఆధిక్యం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 50 ఓవర్లలో 295/7 స్కోరు సాధించింది. ఓపెనర్ జస్టిన్ గ్రీవ్స్ (108 బంతుల్లో 12 ఫోర్లతో 101) శతకం బాదగా, క్యాంప్‌బెల్ (62), ఆమిర్ జంగూ (58 నాటౌట్) హాఫ్ సెంచరీలు సాధించారు. స్పిన్నర్ కుల్దీ్‌పనకు నాలుగు, పేసర్ ప్రసిద్ధ్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత భారీ ఛేదనలో భారత్ 41.4 ఓవర్లలో రెండు వికెట్లకు 300/2 పరుగులు చేసి గెలిచింది. రోహిత్ (32) ఫర్వాలేదనిపించాడు. చేజ్, జోసె్‌ఫలకు ఒక్కో వికెట్ దక్కింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా కుల్దీప్ నిలిచాడు.
బాదేసిన కోహ్లీ, గిల్: భారీ ఛేదనలో ఓపెనర్ గిల్‌కు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ జత కలవడంతో విండీస్ బౌలర్లు బంతులు వేయడం తప్ప చేసేదేమీ లేకపోయింది. బౌలర్ ఎవరైనా అలవోకగా బౌండరీలు బాదేస్తూ ఈ జోడీ మైదానంలో చెలరేగింది. 11 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బతికిపోయిన గిల్ ఆ తర్వాత మాత్రం ఫీల్డర్లకు ఎలాంటి చాన్స్ ఇవ్వలేదు. అటు మరో ఓపెనర్ రోహిత్ శర్మ సైతం క్రీజులో ఉన్నంతసేపు అద్భుత షాట్లతో ఆకట్టుకున్నాడు. అతడి క్యాచ్‌ను విండీస్ ఫీల్డర్ వదిలేసినా సద్వినియోగం చేసుకోలేకపోయిన రోహిత్ 12వ ఓవర్‌లో వెనుదిరిగాడు. దీంతో తొలి వికెట్‌కు 74 పరుగులు వచ్చాయి. ఇక గిల్‌కు విరాట్ జత కలవడంతో భారత స్కోరుబోర్డు దూసుకెళ్లింది. ఇద్దరూ క్రీజులో పాతుకుపోయి బౌలర్లను ఆటాడేసుకున్నారు. ముఖ్యంగా విరాట్ స్వేచ్ఛగా బ్యాట్ ఝుళిపించాడు. 29వ ఓవర్‌లో హ్యాట్రిక్ ఫోర్లతో వన్డే కెరీర్‌లో 15వేల పరుగులను సైతం పూర్తి చేశాడు. ఇక ఫోర్‌తో కెరీర్‌లో పదో శతకం పూర్తి చేసిన గిల్ కాసేపటికే చేజ్ ఓవర్‌లో అవుటయ్యాడు. దీంతో రెండో వికెట్‌కు 151 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అయినా అప్పటికే పటిష్ట స్థితికి చేరిన భారత్‌ను విరాట్ మరింత వేగంగా లక్ష్యం వైపు తీసుకెళ్లాడు. అంతేకాకుండా సిక్సర్‌తో 74 బంతుల్లోనే తన మూడో ఫాస్టెస్ట్ సెంచరీని పూర్తి చేశాడు. ఆ తర్వాత గేరు మార్చిన విరాట్ రెండు వరుస సిక్సర్లతో మరో 50 బంతులుండగానే మ్యాచ్‌ను ముగించాడు.
ఓపెనర్ల శతక భాగస్వామ్యం
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన విండీస్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు గ్రీవ్స్, క్యాంప్‌బెల్ చెలరేగారు. భారత బౌలర్లను ఈ జోడీ దీటుగా ఎదుర్కోవడంతో తొలి పవర్‌ప్లేలో జట్టు 85 పరుగులు సాధించింది. అరంగేట్ర స్పిన్నర్ నమన్‌తో పాటు నితీశ్, అకీబ్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఓపెనర్ల జోరుకు 19 ఓవర్లపాటు వికెట్ కూడా తీయలేకపోయారు. చివరికి 20వ ఓవర్‌లో క్యాంప్‌బెల్‌ను కుల్దీప్ అవుట్ చేయడంతో తొలి వికెట్‌కు 135 పరుగులు భారీ భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత కార్టీ (13), హోప్ (12) నిరాశపర్చగా స్కోరులో వేగం తగ్గింది. 20-30 ఓవర్ల మధ్య కేవలం రెండు బౌండరీలు మాత్రమే రాగలిగాయి. ఇక కెరీర్‌లో తొలి సెంచరీ సాధించిన గ్రీవ్స్‌తో పాటు ఆండ్రూ (0)ను కుల్దీప్ 36వ ఓవర్‌లో వెనక్కిపంపాడు. ఈ దశలో జంగూ-చేజ్ (24) జోడీ ఆరో వికెట్‌కు 52 పరుగులు జోడించింది. 38 బంతుల్లోనే ఫిఫ్టీని పూర్తి చేసిన జంగూ జోరుకు చివరి ఐదు ఓవర్లలో విండీస్ 46 పరుగులు సాధించింది.
స్కోరుబోర్డు
వెస్టిండీస్: క్యాంప్‌బెల్ (సి) ప్రసిద్ధ్ (బి) కుల్దీప్ 62, గ్రీవ్స్ (ఎల్బీ) కుల్దీప్ 101, కార్టీ (సి) గిల్ (బి) ప్రసిద్ధ్ 13, హోప్ (సి) జడేజా (బి) కుల్దీప్ 12, జంగూ (నాటౌట్) 58, ఆండ్రూ (సి) రోహిత్ (బి) కుల్దీప్ 0, చేజ్ (బి) ప్రసిద్ధ్ 24, ఫోర్డ్ (సి) నమన్ (బి) నితీశ్ 7, మోటీ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు: 14; మొత్తం: 50 ఓవర్లలో 295/7. వికెట్ల పతనం: 1-135, 2-176, 3-195, 4-198, 5-198, 6-250, 7-288. బౌలింగ్: ప్రసిద్ధ్ 10-0-60-2, నితీశ్ కుమార్ 5-0-45-1, బ్రార్ 10-0-60-0, జడేజా 10-0-54-0, నమన్ 5-0-33-0, కుల్దీప్ 10-1-40-4.
భారత్: రోహిత్ (సి) ఆండ్రూ (బి) జోసెఫ్ 32, గిల్ (సి) ఆండ్రూ (బి) చేజ్ 110, విరాట్ (నాటౌట్) 139, రుతురాజ్ (నాటౌట్) 13, ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: 41.4 ఓవర్లలో 300/2. వికెట్ల పతనం: 1-74, 2-225; బౌలింగ్: సీల్స్ 7-0-32-0, ఫోర్డ్ 5-0-39-0, జోసెఫ్ 9-1-81-1, మోటీ 10-0-66-0, చేజ్ 10-0-64-1, కార్టీ 0.4-0-17-0.
1
ఒకే ప్రత్యర్థి (విండీస్)పై ఎక్కువ శతకాలు (10) బాదిన బ్యాటర్‌గా విరాట్. గతంలో శ్రీలంకపై కూడా ఇన్నే సెంచరీలు సాధించాడు. అలాగే ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు (9) బాదడం కూడా విరాట్‌కిదే తొలిసారి.

15 వేల క్లబ్‌లోకి..
స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా (303 ఇన్నింగ్స్) 15 వేల పరుగులు పూర్తి చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. అయితే ఈ ఫార్మాట్‌లో ఎక్కువ పరుగుల రికార్డు మాత్రం సచిన్ టెండూల్కర్ (18,426) పేరిటే ఉంది. అలాగే ఇప్పటికే వన్డేల్లో అత్యధిక శతకాల (55) జాబితాలో విరాట్ అగ్రస్థానంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. మూడు ఫార్మాట్లలో కలిపి తనకిది 86వ సెంచరీ. లిస్ట్ ‘ఎ’ క్రికెట్‌లోనూ సచిన్‌తో సమంగా 60 శతకాలతో విరాట్ నిలిచాడు.
ఈ వార్తలూ చదవండి
ఏఐ ముప్పు.. ఆ తప్పు మాత్రం చేయొద్దు.. టెకీలకు హెచ్చరిక
నీటిలో మునగకుండా జాగ్వార్‌ను ఎలా కాపాడారంటే