ఏఐ ముప్పు.. ఆ తప్పు మాత్రం చేయొద్దు.. టెకీలకు హెచ్చరిక
ABN , Publish Date - Sep 27 , 2026 | 02:35 PM
కృత్రిమే మేధ సాఫ్ట్‌వేర్ రంగంలోని వారికి పెద్ద ముప్పుగా మారుతోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ యువతి ఇతర టెకీలకు చేసిన సూచన వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: కృత్రిమే మేధ సాఫ్ట్‌వేర్ రంగంలోని వారికి పెద్ద ముప్పుగా మారుతోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. టెకీల ఉద్యోగ భవిష్యత్తుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ యువతి ఇతర టెకీలకు చేసిన సూచన వైరల్‌గా మారింది. ఈ సమయంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు పాటించాల్సిన ఒకే ఒక సలహా ఇదేనని అనేక మంది కామెంట్ చేశారు.
ప్రిన్సీ వెర్షావల్ ఈ వీడియోను ఇన్‌స్టాలో పోస్టు చేశారు. ‘మీరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయితే.. దీర్ఘకాలిక లోన్స్ మాత్రం తీసుకోవద్దు. మీ శాలరీ రూ.40 లక్షలు అయినా.. లేదా రూ.50 లక్షలు, రూ.కోటి అయినా ఇలాంటి లోన్స్ జోలికి పోవద్దు. ఎందుకంటే ఏఐతో ముప్పు పొంచి ఉందన్నది వాస్తవం. కాబ్టటి, మీ కుటుంబు ఆర్థిక భద్రత కోసం సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ జాబ్‌ను అతిగా నమ్ముకోవద్దు’
‘ఇది నేను మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పట్లేదు. నా ఫ్రెండ్స్ పరిస్థితి చూసి ఈ సలహా ఇస్తున్నాను. ఈఎంఐల భారం ఉండగా లేఆఫ్స్‌కు గురైతే పడే ఒత్తిడి తట్టుకోవడం కష్టం. ఈ ఏడాది మీ జాబ్ ఉండవచ్చు. వచ్చే ఏడాదీ ఢోకా ఉండకపోవచ్చు. కానీ 15 ఏళ్ల తరువాత కూడా మీ జాబ్ ఇలాగే ఉంటుందని అనుకోలేము. కానీ అప్పటికి లోన్ మాత్రం యథాతథంగా కొనసాగుతుంది. కాబట్టి, ఆర్థిక నిర్ణయాల విషయంలో జాగ్రత్త’ అని పోస్టు పెట్టారు. ఈ పోస్టుపై జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఈ సమయంలో టెకీలు తూచా తప్పకుండా పాటించాల్సిన ఆచరణాత్మక సలహా ఇదేనని అనేక మంది కామెంట్ చేశారు.
ఇవీ చదవండి:
బాంబర్లు దూసుకెళ్లిన వేళ.. ట్రంప్ ఉలిక్కిపాటు! జిన్‌పింగ్ కూల్‌గా.!
పెన్సిల్ మొనపై ‘చిన్న’ గణేశుడు.. కళాకారుడి అద్భుత సృష్టి!