Share News

నీటిలో మునగకుండా జాగ్వార్‌ను ఎలా కాపాడారంటే..

ABN , Publish Date - Sep 27 , 2026 | 08:21 AM

ప్రాణం మీదకు వస్తే అడవికి రాజైనా.. బతకడానికి పోరాడాల్సిందే. లోతైన నీటిలో చిక్కుకుని అలసిపోయిన ఓ జాగ్వార్‌ రెస్క్యూ బృందం చిన్న ఐడియాతో కాపాడింది..

నీటిలో మునగకుండా జాగ్వార్‌ను ఎలా కాపాడారంటే..
Jaguar Trapped in Water

ఇంటర్నెట్ డెస్క్: ప్రాణం మీదకు వస్తే అడవికి రాజైనా.. బతకడానికి పోరాడాల్సిందే. లోతైన నీటిలో చిక్కుకుని అలసిపోయిన ఓ జాగ్వార్‌.. చివరి ఆశగా రెస్క్యూ బృందం అందించిన బ్యాగ్‌ను గట్టిగా పట్టుకుంది. ఆ తర్వాత సిబ్బంది దాన్ని సురక్షితంగా బయటకు తీసుకొచ్చిన తీరు ఇప్పుడు నెటిజన్లను కదిలిస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓ జాగ్వార్ నీటిలో ఉండటాన్ని రెస్క్యూ టీమ్ గమనించింది. దాన్ని రక్షించేందుకు ఓ పొడవైన రెస్క్యూ బ్యాగ్‌ను నీటిలోకి వదిలారు. అది చూసి జాగ్వార్ వెంటనే ఆ బ్యాగ్‌ వైపు వెళ్లి తన పంజాలతో గట్టిగా పట్టుకుంది. దీంతో రెస్క్యూ సిబ్బంది నెమ్మదిగా దాన్ని పైకి లాగడం ప్రారంభించారు.


జాగ్వార్ బ్యాగ్‌ను వదలకుండా గట్టిగా పట్టుకుని ఉండగా.. సిబ్బంది ఎంతో అప్రమత్తంగా దాన్ని పడవ వద్దకు తీసుకొచ్చారు. అనంతరం దానికి ఎలాంటి ప్రమాదం జరగకుండా జాగ్రత్తగా నీటి నుంచి బయటకు తీసుకు వచ్చి రక్షించారు.

ఈ వీడియో @Dreams_realites అనే యూజర్ ఎక్స్‌లో ట్వీట్ పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్ ‘ ప్రతి జీవి బ్రతకడానికే ప్రయత్నిస్తుందని ఈ వీడియో చూస్తే తెలుస్తోంది’ అని, ‘ఎంత క్రూరమృగమైనా.. ప్రాణాల మీదకు వస్తే భయపడుతుంది’ అని ఒకరు, ‘రెస్క్యూ టీమ్ గ్రేట్ వర్క్’ అని మరో నెటిజన్ కామెంట్ చేశారు.


ఇవీ చదవండి:

బాంబర్లు దూసుకెళ్లిన వేళ.. ట్రంప్‌ ఉలిక్కిపాటు! జిన్‌పింగ్‌ కూల్‌గా.!

పెన్సిల్‌ మొనపై ‘చిన్న’ గణేశుడు.. కళాకారుడి అద్భుత సృష్టి!

Updated Date - Sep 27 , 2026 | 09:24 AM