Share News

తుఫాన్ అలర్ట్.. శ్రీకాకుళం జిల్లాలో పాఠశాలలకు సెలవులు

ABN , Publish Date - Sep 22 , 2026 | 10:07 AM

తుఫాన్ తీవ్రత నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారీ వర్షాల కారణంగా పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుడ్కర్ సెలవులు ప్రకటించారు.

 తుఫాన్ అలర్ట్..  శ్రీకాకుళం జిల్లాలో పాఠశాలలకు సెలవులు
Srikakulam Cyclone Alert

శ్రీకాకుళం జిల్లా, సెప్టెంబర్ 22 (ఆంధ్రజ్యోతి): తుఫాన్ తీవ్రత నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారీ వర్షాల కారణంగా పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుడ్కర్ సెలవులు ప్రకటించారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని ఎంఈఓలను ఆదేశించారు. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా ముసురు వాతావరణం నెలకొని ఉందని.. మధ్యాహ్నం తర్వాత వర్షాలు తీవ్రత పెరిగే అవకాశం ఉందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుడ్కర్ పేర్కొన్నారు.


అధికారులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అచ్చెన్నాయుడు

Kinjarapu Atchannaidu

శ్రీకాకుళం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని ఏపీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. వర్షాల దృష్ట్యా అధికారులను అప్రమత్తం చేసినట్లు తెలిపారు. కలెక్టర్, ఎస్పీతో మాట్లాడి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నట్లు వెల్లడించారు. ఇరిగేషన్, రెవెన్యూ విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి దిశానిర్దేశం చేశారు. తీరప్రాంత గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి..

ప్రజలు చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు, హోర్డింగ్స్ వద్ద ఉండరాదని మంత్రి తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. వానల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని మార్గనిర్దేశం చేశారు. ముందస్తు సన్నద్ధతతో, అప్రమత్తతతో ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా చూడాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వివరాల కోసం ఈ నంబర్‌లో - 08942 240557 సంప్రదించాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జూనియర్ డాక్టర్లకు ఏపీ సర్కార్ శుభవార్త.. స్టైపెండ్ పెంచుతూ ఉత్తర్వులు జారీ

ఏపీలో అతిభారీ వర్షాలు.. అధికారులు అప్రమత్తంగా ఉండాలి: హోం మంత్రి అనిత

పోలీసులు కొట్టడం వల్లే సాయికృష్ణ చనిపోయాడు: సిట్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Sep 22 , 2026 | 10:33 AM