ఎన్నికలపై నటుడు ప్రకాశ్‌రాజ్ మాటలు వింటే నవ్వు వస్తోంది: మంత్రి
ABN , Publish Date - Oct 05 , 2026 | 04:22 PM
కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి నేతలు ఓటు చోరీ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ విమర్శించారు. కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఎన్నికలు రద్దు చేయాలని ఎందుకు అంటున్నారని ప్రశ్నించారు.
ఢిల్లీ, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి నేతలు ఓటు చోరీ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ (AP Minister Satya Kumar Yadav) విమర్శించారు. కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఎన్నికలు రద్దు చేయాలని ఎందుకు అంటున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలోనే రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలపై నమ్మకం పోయేలాగా వారు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.
ఓటములతో గుణపాఠం నేర్చుకోవడం లేదు..
ఈరోజు (సోమవారం) ఢిల్లీలో మీడియాతో మంత్రి సత్యకుమార్ మాట్లాడారు. కాంగ్రెస్ ,ఇండియా కూటమి నేతలు ఆయా ఎన్నికల్లో ఓటములతో గుణపాఠం నేర్చుకోవడం లేదని అన్నారు. విశ్వాసనీయత లేని వారిని తీసుకువచ్చి కాంగ్రెస్ అగ్రనేతలు మాట్లాడిస్తున్నారని ఆగ్రహించారు. ఎన్నికల గురించి నటుడు ప్రకాశ్‌రాజ్ చెప్పే మాటలు వింటే నవ్వు వస్తోందని ఎద్దేవా చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ కారణంగానే భారతీయులకు గౌరవం దక్కుతుందని ఉద్ఘాటించారు.
ఎన్నికల్లో అవకతవకలు ఎలా జరుగుతాయి..
మల్లికార్జున ఖర్గే ఎన్నికల గురించి మాట్లాడుతున్నారని.. కేరళం, తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్‌లో వారు గెలిచారని.. అప్పుడు ఎందుకు మాట్లాడలేదని మంత్రి సత్యకుమార్ ప్రశ్నల వర్షం కురిపించారు. ఎన్నికల ప్రక్రియ గురించి తెలిసిన వారు ఇలా మాట్లాడరని చెప్పుకొచ్చారు. ఎన్నికల ప్రక్రియలో రాజకీయ పార్టీలకు చెందిన బీఎల్‌వోలు, ప్రభుత్వ అధికారులు ఉంటారని ప్రస్తావించారు. అలాంటప్పుడు ఎన్నికల్లో అవకతవకలు ఎలా జరుగుతాయని నిలదీశారు. కాంగ్రెస్ నేతలు అసత్య వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబట్టారు. 1950 నుంచి ‘సర్’ ప్రక్రియ జరుగుతోందని.. అది ఒక నిరంతర ప్రక్రియ అని వివరించారు.
ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు..
పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఎన్నికల్లో ప్రజలు భారీగా పాల్గొన్నారని మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఈ ఎలక్షన్‌లో 92.47 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని ప్రస్తావించారు. ఎన్నికల అధికారిపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నారని ప్రశ్నించారు. బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరపాలని అంటున్నారని.. టెక్నాలజీ ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తుంటే కాంగ్రెస్ నేతలకు నచ్చడం లేదని మండిపడ్డారు. 13 కోట్ల మంది ఓట్లు తొలగించారని ఫేక్ ప్రచారాలు చేస్తున్నారని.. అంతమంది ఓట్లను తొలగించలేదని స్పష్టం చేశారు. ఫామ్- 6లో ఒక్క మార్పు కూడా జరగలేదని.. తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఎన్నికల అధికారుల మధ్య అభిప్రాయ భేదాలు లేవని.. ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తేల్చిచెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గొడ్డలి పార్టీ పాలనలో 6 లక్షల పేదల ఇళ్లు రద్దు చేశారు: సీఎం చంద్రబాబు
ఏపీలో గృహ నిర్మాణ రంగంలో నూతన శకం ప్రారంభం: పవన్ కల్యాణ్
ప్రజల స్పందనను వక్రీకరించొద్దు.. జై రాం రమేశ్‌కు చంద్రబాబు, లోకేశ్ కౌంటర్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News