ట్రంప్, మోదీ ‘మంచి’ స్నేహితులు కాగలరా?
ABN , Publish Date - Jan 31 , 2025 | 02:23 AM
‘అబ్‌కీ బార్ ట్రంప్ సర్కార్’ అని సెప్టెంబర్ 2019లో టెక్సాస్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘోషించారు. నాటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2020లో జరగనున్న అధ్యక్ష పదవీ...

‘అబ్‌కీ బార్ ట్రంప్ సర్కార్’ అని సెప్టెంబర్ 2019లో టెక్సాస్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘోషించారు. నాటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2020లో జరగనున్న అధ్యక్ష పదవీ ఎన్నికలలో కచ్చితంగా విజయం సాధిస్తారనే తన విశ్వాసాన్ని మోదీ అలా సుదృఢంగా వ్యక్తం చేశారు. కొద్ది నెలల అనంతరం ఫిబ్రవరి 2020లో అహ్మదాబాద్‌లో ‘నమస్తే ట్రంప్’ అనే ఒక బృహత్తర బహిరంగ కార్యక్రమంలో కూడా మోదీ అదే విశ్వాసాన్ని మళ్లీ వ్యక్తం చేశారు. ‘అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్’ అనేది ఒక తప్పుడు అభిప్రాయం. ఔచిత్య రహితంగా అత్యుత్సాహంతో బహిరంగపరిచిన ఒక పొరపాటు నిర్ణయం. కనుకనే 2020 నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితం మోదీని దిగ్భ్రాంతి పరిచింది. డొనాల్డ్ ట్రంప్ ఆ ఎన్నికలలో అనూహ్యంగా ఓడిపోయారు. గత నాలుగేళ్లుగా వాషింగ్టన్‌లో ‘అబ్ కీ బార్ బైడెన్ సర్కార్’ అనే భావన బలంగా ఉన్నది. నవంబర్ 2024 అధ్యక్ష ఎన్నికలలో ట్రంప్ అనూహ్యంగా భారీ మెజారిటీతో గెలిచారు. మరి 2019–20లో ట్రంప్, మోదీ మధ్య వర్థిల్లిన స్నేహ సంబంధాలు పునరుజ్జీవమవుతాయా అన్నది ఇప్పుడు మన ముందున్న ప్రశ్న.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఇటీవల టెలిఫోన్‌లో జరిపిన ఉభయ కుశలోపరిలో ట్రంప్‌ను తన ‘ప్రియమైన స్నేహితుడు’గా మోదీ అభివర్ణించారు. శక్తిమంతులైన ఈ నాయకులు ఇరువురూ జనాలను ఆకట్టుకోవడంలో సాటిలేని ఘనాపాటీలు అనడంలో సందేహం లేదు. వారి వ్యవహారశైలులు అప్పుడప్పుడు ఆశ్చర్యకరంగా ఒకే తీరులో ఉండడం పరిపాటి. జనాకర్షక నినాదాల ప్రాధాన్యం, ఉపయుక్తతను ఇరువురూ బాగా అర్థం చేసుకున్నవారే. అటువంటి నినాదాలతో బాగా లబ్ధి పొందినవారు కూడా. ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ అనేది ట్రంప్ నినాదం కాగా 2047 నాటికి వికసిత్ భారత్‌కు దారితీసే ‘అమృత్ కాల్’ను సృష్టిస్తానని నరేంద్ర మోదీ వాగ్దానం చేశారు. కాలం చెల్లిన ఉదారవాద రాజకీయాలపై మితవాద జాతీయవాదం విజయానికి ప్రతినిధులుగా మోదీ, ట్రంప్‌లను వారి అభిమాన గణాలు భావిస్తున్నాయి. గత కాలం ల్యూటెన్స్ కులీన వర్గాల ప్రాబల్యాన్ని మోదీ దెబ్బతీయగా వాషింగ్టన్ సంప్రదాయ పాలక వర్గాల ప్రాబల్యానికి ట్రంప్ విఘాతం కలిగించారు. వలసకారులకు వ్యతిరేకంగా ట్రంప్ గర్జనలు, భారతీయ ముస్లింలను ‘అంతర్గత శత్రువులు’గా పరిగణించే మోదీ మద్దతుదారులలో పూర్తిగా ప్రతిధ్వనించాయి. వలసకారులను నిరోధించేందుకు సరిహద్దుల్లో గోడలు నిర్మించాలని ట్రంప్ మద్దతుదారులు కోరుతుండగా మసీదుల స్థానంలో ఆలయాలను నిర్మించేందుకు మోదీ అనుయాయులు ప్రయత్నిస్తున్నారు. ఒక ‘శాశ్వత’ శత్రువు కోసం అన్వేషణ అటు ట్రంప్, ఇటు మోదీ మద్దతుదారులను సమ్ముగ్ధం చేస్తోంది, కార్యనిమగ్నులనూ చేస్తోంది.
ట్రంప్–మోదీల మధ్య సమాంతరాలను అత్యుక్తులుగా చెప్పుకోనవసరం లేదు. నిజం చెప్పాలంటే వారి మధ్య సదృశాల కంటే వ్యత్యాసాలే ఎక్కువ. ఇరువురి రాజకీయ ప్రస్థానాలు చాలా భిన్నమైనవి. మోదీ ఒక అర్ధ శతాబ్ది కాలంగా రాజకీయాలలో ఉన్నారు. ఆరెస్సెస్ ప్రచారక్‌గా ప్రారంభమై క్రమంగా రాజకీయ సోపానాలను అధిరోహించి ప్రధానమంత్రి పదవికి చేరుకున్నారు. మోదీకి భిన్నంగా ట్రంప్ ఒక విజయవంతమైన వ్యాపారి. బీజేపీ శ్రేణుల నుంచి మోదీ ప్రభవించగా ట్రంప్ రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష పదవీ అభ్యర్థిత్వాన్ని సర్వోత్కృష్టుడైన ‘బయటి వ్యక్తి’గా కైవసం చేసుకున్నారు. మోదీ తనను తాను ఒక హిందూత్వ యోధుడుగా తీర్చిదిద్దుకున్నారు. లావాదేవీలు, ఒప్పందాల విషయంలో అనితరసాధ్యుడైన నేర్పరిగా ట్రంప్ ప్రసిద్ధి పొందారు. మోదీలో భావజాల అభినివేశం పరిపూర్ణంగా ఉండగా ట్రంప్‌లో వ్యాపార కాంక్షలు ఆయన స్వాభావిక ప్రవృత్తిగా ఉండడం కద్దు. ఈ నాయకులిరువురూ వ్యక్తి పూజను ప్రోత్సహించినవారే. ఇరువురిలోను స్వానురాగ ప్రవృత్తి అమితంగా ఉంది.
మోదీ తన పదేళ్ల ప్రధాన మంత్రిత్వ కాలంలో తరచు అధికార రాజకీయాల సంప్రదాయ సూత్రాలకు విరుద్ధంగా వ్యవహరించి భారత రాజకీయాలపై తనదైన ముద్ర వేశారు. అప్పుడప్పుడూ తన ప్రత్యర్థులను ఆత్మరక్షణలోకి నెట్టివేసేందుకు దిగ్భ్రాంతికరమైన నిర్ణయాలు తీసుకున్నారు. తద్వారా ప్రత్యర్థులను భయోత్పాతానికి గురిచేశారు. 2016లో పెద్దనోట్ల రద్దు అటువంటి చర్యే. నల్లధనాన్ని సంపూర్ణంగా నిర్మూలించే పేరిట ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారు. విధాన నిర్ణయాల రూపకల్పన ప్రక్రియను చాలవరకు కేంద్రీకృతం చేసినప్పటికీ రాజకీయ ఔచిత్య లక్షణరేఖను మోదీ ఎన్నడూ ఉల్లంఘించలేదు. ఒక పొరుగుదేశాన్ని బెదిరించేందుకు అర్ధరాత్రి సమయంలో మోదీ ట్వీట్ చేయడమనేది ఎన్నడూ జరగలేదు. ఆయన ఆ విధంగా వ్యవహరించడమనేది ఎప్పటికీ జరగని పని అని కూడా నిశ్చితంగా చెప్పవచ్చు.
మోదీకి భిన్నంగా ట్రంప్ నిత్యం ఆమోదయోగ్యమైన రాజకీయ ప్రవర్తనా నియమాలకు విరుద్ధంగా వ్యవహరించడం పరిపాటి. అధ్యక్ష పదవీ బాధ్యతలు చేపట్టిన వారం రోజుల్లోనే ఆయన ఎన్నో కటువైన ప్రకటనలు చేశారు; తీవ్ర పర్యవసానాలకు దారితీసే ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులు జారీ చేశారు. అవన్నీ తన ప్రత్యర్థులు, వ్యతిరేకులను గందరగోళపరిచేందుకు, వారిని సవాల్ చేసేందుకు ఉద్దేశించినవేనని మరి చెప్పనవసరం లేదు. అమెరికా అధ్యక్షుడిది అద్వితీయమైన వైయక్తిక వ్యవహారశైలి. రాజకీయ విజ్ఞతకు అందులో స్థానం లేదు. ఎవరేమనుకున్నా ట్రంప్ లెక్క చేయరు. తాను చేయాలనుకున్నది చేసి తీరుతారు. తన నిర్ణయాలకు, చర్యలకు విస్తృత స్థాయిలో ఆమోదం పొందేందుకు మోదీ తప్పక ప్రయత్నిస్తారు. స్వచ్ఛ భారత్ ప్రచారానికి లోగోగా వినియోగించుకునేందుకు మహాత్మాగాంధీ కళ్లజోడును ఎంపిక చేసుకోవడమే అందుకొక నిదర్శనం. ట్రంప్‌కు తన స్వదేశ గతంతో తాదాత్మ్యత లేదు. చరిత్ర గురించిన ఆయన దృష్టి స్వయం ప్రతిష్ఠకు మాత్రమే పరిమితమయింది.
ఇప్పుడు మనం అసలు ప్రశ్నకు వద్దాం: ఆ నాటి చెలిమికి ఐదు సంవత్సరాలు అంతరాయమేర్పడిన అనంతరం ఇప్పుడు మళ్లీ పాత స్నేహం కుసుమిస్తున్న సమయంలో డోనాల్డ్ ట్రంప్, నరేంద్ర మోదీ ఎలా కలిసికట్టుగా ముందుకు సాగుతారు? ఎటువంటి రాజకీయ అనుబంధంలోనైనా మిత్రుడు లేదా భాగస్వామి కంటే తాను తక్కువ స్థానంలో ఉండడాన్ని మన మోదీ ససేమిరా అంగీకరించరు కదా. ఇక ట్రంప్ విషయానికి వస్తే జన నీరాజనాలను మరెవ్వరితోను కలిసి పంచుకోవడానికి ఆయన ఎట్టి పరిస్థితులలోను సుముఖత చూపరు గాక చూపరు. తమ ఉభయులలో తానే గొప్ప అనే అభిజాత్యాన్ని ప్రదర్శించేందుకు ట్రంప్, మోదీ ఇరువురూ తప్పక ప్రయత్నిస్తారు. ప్రతి ఒక్కరినీ సతాయించేందుకు లేదా భయపెట్టేందుకు డొనాల్డ్ ట్రంప్ సిద్ధమైనప్పటికీ ఆయనతో సమావేశమయినప్పుడు తమ వైఖరి, అభిప్రాయాలను నిక్కచ్చిగా వ్యక్తం చేసేందుకు ప్రధాని మోదీ ఆయన మంత్రివర్గ సహచరులు, ఉన్నతాధికారులు దృఢనిశ్చయంతో ఉన్నారు. సౌష్ఠవం లోపించిన స్నేహ బంధంగా భారత్–అమెరికా ద్వైపాక్షిక సంబంధాలను పరిగణించాలి. నడుస్తున్న చరిత్రను ప్రభావితం చేయగల శక్తి సామర్థ్యాలు ప్రస్తుతం లేకపోయినప్పటికీ అమెరికా ఇప్పటికీ ప్రపంచ అగ్రగామిగా వెలుగొందుతోంది. అగ్రరాజ్య హోదాను ప్రగాఢంగా కోరుకుంటున్న భారత్, అంతర్జాతీయ వ్యవహారాలలో తనకొక ప్రత్యేక గుర్తింపు, మరింత ప్రాధాన్యాన్ని భారత్ ఎంతగా అభిలషిస్తోందో మరి చెప్పనవసరం లేదు. ‘అమెరికా ఫస్ట్’ అనే లక్ష్యానికి అనుగుణమైన రీతిలో ఒక సువిశాల లాభప్రద మార్కెట్‌గా భారత్‌ను ట్రంప్ భావిస్తున్నారనడంలో సందేహం లేదు. అయితే భారత్‌ను ఒక విశ్వసనీయమైన వ్యూహాత్మక మిత్ర దేశంగా వాషింగ్టన్ చూడగలదనే ఆశాభావం మోదీకి ఇంకా ఉన్నది.
భారత్, చైనాలు అధిక సుంకాలతో బాగా లబ్ధి పొందుతున్న దేశాలుగా ట్రంప్ గట్టిగా భావిస్తున్నారు. తన విలక్షణ శబ్దాడంబరంతో నిరసిస్తున్నారు కూడా. ఇది మనకు ఎంతైనా ఆందోళనకరమైన విషయమే. దౌత్య మర్యాదలు పాటించే ఓర్పు, నేర్పు ట్రంప్‌కు లేవు. సభ్యతా సంస్కారాలకు విరుద్ధంగా వ్యవహరించేందుకు ఆయన వెనుకాడరు. ఆయన ప్రపంచ దృక్పథంలో వాణిజ్య ప్రయోజనాలకు అగ్ర ప్రాధాన్యమున్నది. మరి ఇటువంటి నాయకుడిని మిత్రుల ప్రశస్త మాటలు, పాత స్నేహాలు కదిలిస్తాయా? చెప్పవచ్చిన దేమిటంటే భవిష్యత్తులో భారత్, చైనాలు రెండిటితోనూ తన సొంత షరతులపై వ్యవహరించేందుకు, ఒప్పందాలు చేసుకునేందుకు ట్రంప్ తప్పక ప్రయత్నిస్తారు. ఎందుకు? అమెరికా ప్రయోజనాలు కాపాడేందుకే. ఈ విషయమై ఎవరికీ ఎటువంటి సందేహం ఉండనక్కరలేదు.
అమెరికాతో మన సంబంధాలు ఎలా పరిణమించనున్నాయి? ఈ విషయంలో వచ్చే కొద్ది నెలలపాటు భారత్ చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతిమంగా జరిగేది మన ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటుందో లేదో ఇప్పుడే చెప్పలేము. వేచి చూడాలి. ట్రంప్‌తో సఖ్యతకు మోదీ ప్రయత్నిస్తారా? 2019 అమెరికా అధ్యక్ష ఎన్నికల తరుణంలో తనకు బహిరంగంగా పరిపూర్ణ మద్దతునిచ్చిన విషయాన్ని ట్రంప్‌కు ఆయన గుర్తు చేయవచ్చు. పాత స్నేహసరసతలు ప్రస్తుత సంబంధాలపై ఎటువంటి ప్రభావాన్ని చూపుతాయన్నది నిశ్చితంగా చెప్పలేము. సమస్యేమిటంటే తననుతాను గొప్పగా ప్రకటించుకునే రియాల్టీ షోలో అమెరికా అధ్యక్షుడు ఒక బిగ్‌బాస్ లాంటి వ్యక్తి. ఈ షోలో కేవలం ఒకే ఒక్కరి – బిగ్‌బాస్– మాటే తొలి, తుది మాట. దానికే సమస్త ప్రాధాన్యం. భారత్‌తో సహా విశాల ప్రపంచమంతా కేవలం ప్రేక్షకులు మాత్రమే. మరి ఈ ట్రంప్ షోలో తదుపరి అంకం ఏమిటో ఎవరికీ తెలియదు. నమ్మకంగా చెప్పగలిగేవారు కూడా ఎవరూ లేరు.
రాజ్‌దీప్ సర్దేశాయి
(వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్)
ఈ వార్తలు కూడా చదవండి...
Investments in AP: ఏపీలో భారీ పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్.. అత్యధికం ఎక్కడంటే
Maha Kumbh Mela: మీ ఊరి నుంచే కుంభమేళాకు బస్సు.. భక్తుల కోసం బంపర్ ఆఫర్
Tribute.. జాతిపిత మహాత్మాగాంధీకి సీఎం చంద్రబాబు నివాళులు
AP News: ఏపీలో అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల క్రమబద్దీకరణ
Read Latest AP News And Telugu News
Updated Date - Jan 30 , 2025 | 09:18 PM
Tags
గుంటూరు
Nara Lokesh: ఆ ఎన్నికలపై నారా లోకేష్ ఫోకస్.. ఇన్‌చార్జ్‌లకు కీలక బాధ్యతలు
CM Chandrababu: దేశంలోనే తొలిసారంటూ సీఎం చంద్రబాబు సంచలన ట్వీట్
YS Sharmila: సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల సంచలన లేఖ..
AP DGP: సంతృప్తితో వెళ్తున్నా.. ఏపీ డీజీపీ ఆసక్తికర వ్యాఖ్యలు
WhatsApp governance: వాట్సాప్‌లో ప్రభుత్వ సేవలు ఎలా పొందాలో తెలుసా.. ఇవి తెలుసుకుంటే ప్రభుత్వం మీ ఇంట్లో ఉన్నట్లే..
Gas leak: గ్యాస్ సిలెండర్ లీక్.. అన్ లోడ్ చేస్తుండగా..
AP News: 145 రోజుల తర్వాత బెయిల్‌పై విడుదలైన వైసీపీ నేత..
Kolusu Parthasarathy: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. ఉద్యోగాలపై మంత్రి కొలుసు పార్థసారధి కీలక ప్రకటన
Kandula Durgesh: జగన్ పాలనలో వైఫల్యాలు.. మంత్రి కందుల దుర్గేష్ హాట్ కామెంట్స్
తాజావార్తలు
శతప్రయోగాల ‘కోట’
Today Horoscope : ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా వుంటుంది.
చరిత్ర పొడుగునా...
ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి
వేతనాలు చెల్లించాలని కార్మికుల సమ్మె
షెడ్యూల్ ఖరారుతో రాజకీయ వేడి
‘అభయ హస్తం’పై ఆశలు..
Beyond Text Generation: An AI Tool That Helps You Write BetterGrammarly|
Install Now
Cancer is threatening to take my child from me. Please help!Donate For Health|
Learn More
68X Return In 19 Years In Nifty500 Momentum 50 TRIAxis Mutual Fund|
Writing in English Doesn't Have to Feel HardGrammarly|
Learn More
Play Now
Hitachi India: Pioneering a Sustainable FutureHitachi|
Learn More
My daughter’s life depends on an expensive transplantDonate For Health|
Learn More
SBI Life - Smart Platina SupremeSBI Life|
Learn More
Play War Thunder now for freeWar Thunder|
Play Now
Crossout: New Apocalyptic MMOCrossout|
Play Now
How can you generate additional income by investing with our AI signal system?Marketsall|
Learn More
War Thunder - Register now for free and play against over 75 Million real PlayersWar Thunder|
Play Now
30 photos that really make you thinkHigh Tally|
దీన్ని ఒక్కసారి తినండి మీ పురుష బలం 10 రెట్లు పెరుగుతుంది.TANTRA MAX|
క్లిక్ చేయి
Powering the growth of India's industriesMitsubishi Electric|
Original Adidas Winter Track-Suit 75% Discount, Offer Only for limited days.Original Adidas|
Shop Now
ప్రయత్నించు
Stay at the Finest Luxury Hotels for Cheap (See 2025 Deals)Finest Luxury Hotels | Search Ads|
Learn More
Vijayasai Reddy: ఎంపీ పదవికి రాజీనామా.. కూటమి నుంచి డబ్బులు.. విజయసాయి సంచలన వ్యాఖ్యలుAndhra Jyothy
Vijayasai Reddy: విజయసాయిరెడ్డి భవిష్యత్తు ప్లాన్ ఇదేనా..!Andhra Jyothy
Original Adidas Striped Men Black Track Suit With 75% DiscountOriginal Adidas|
Shop Now
ఇంకా తెలుసుకో