Share News

WhatsApp governance: వాట్సాప్‌లో ప్రభుత్వ సేవలు ఎలా పొందాలో తెలుసా.. ఇవి తెలుసుకుంటే ప్రభుత్వం మీ ఇంట్లో ఉన్నట్లే..

ABN , Publish Date - Jan 30 , 2025 | 04:32 PM

AP GOVT: ఏపీ ప్రభుత్వం "మన మిత్ర - ప్రజల చేతిలో ప్రభుత్వం" ద్వారా వాట్సాప్ గవర్నెన్స్ సేవలను గురువారం ప్రారంభించింది. ప్రజలు కార్యాలయాల చుట్టూ రోజుల తరబడి తిరగకుండా, వారి అవసరాలకు అనుగుణంగా సేవలు ఇంటి దగ్గర నుంచి అందించడానికి ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించింది. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 161 ప్రభుత్వ సేవలు మొదటిసారిగా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సేవలు సాంకేతికంగా, సురక్షితంగా ఉంటాయని, ప్రజల గోప్యత పట్ల అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

WhatsApp governance: వాట్సాప్‌లో ప్రభుత్వ సేవలు ఎలా పొందాలో తెలుసా.. ఇవి తెలుసుకుంటే ప్రభుత్వం మీ ఇంట్లో ఉన్నట్లే..

అమరావతి: ప్రజలు కార్యాలయాల చుట్టూ ఏదైనా సమస్య కోసం రోజుల తరబడి తిరగకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలు ఇబ్బంది పడకుండా వివిధ పౌర సేవలను త్వరగా అందించడానికి ‘‘మన మిత్ర - ప్రజల చేతిలో ప్రభుత్వం’’ ద్వారా వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ఇవాళ(గురువారం) నుంచి అందుబాటులోకి తీసుకువచ్చింది. వివిధ పనుల నిమిత్తం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండా ఇంటి దగ్గర నుంచే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వం పరిష్కరించనుంది. మానవ వనరులు, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ ఈరోజు అధికారికంగా వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వాట్సాప్ గవర్నెన్స్ ఎలా పని చేస్తుందో నారా లోకేష్ వివరించారు.


స్కాన్‌ చేస్తే అందుబాటులోకి సమాచారం..

వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా తొలి దశలో 161 ప్రభుత్వ సేవలు, రెండో విడతలో 360 రకాల సేవలను వాట్సాప్‌లోనే అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. దేశంలోనే మొదటిసారిగా ఏపీలో వాట్సాప్‌ పాలనను అమలు చేస్తున్నట్లు తెలిపారు. వాట్సాప్‌ ద్వారా వివిధ సేవలు అందించడంతో పాటు ప్రభుత్వ సమాచారం కూడా ప్రజలకు తెలియజేస్తామని అన్నారు. ఇందుకోసం 9552300009 మొబైల్ నంబర్‌ను వాట్సాప్ ద్వారా వినియోగించుకోవచ్చని మంత్రి నారా లోకేష్ సూచించారు.


నకిలీ పత్రాలకు అడ్డుకట్ట..

ఈ నంబరుకు వెరిఫైడ్‌ ట్యాగ్‌ (టిక్‌ మార్క్‌) కేటాయించినట్లు చెప్పారు. ఈ నంబరు వన్‌స్టా్‌ప్ సెంటర్‌లా పనిచేయనుంది. సర్టిఫికెట్ల మీద క్యూ ఆర్‌ కోడ్‌లతో జారీ చేస్తామని, వాటిని స్కాన్‌ చేస్తే వాటి వివరాలు ఏపీ ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ప్రత్యక్షం అవుతాయని, నకిలీ పత్రాలను సృష్టించే అవకాశం ఉండదని మంత్రి లోకేష్‌ స్పష్టం చేశారు. రెవెన్యూ, మున్సిపల్, ఎండోమెంట్ సేవలను వాట్సాప్‌లో అందజేస్తామని అన్నారు. టీటీడీ మినహా అన్ని దేవాలయాల సేవలను వాట్సాప్‌లో ఏపీ ప్రభుత్వం అందిస్తుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు.


ఈ సూచనలు తప్పక పాటించాలి..

  • వాట్సాప్‌లో అందించే పౌర సేవలకు సంబంధించి మెటా నుంచి ఎలాంటి ఫోన్‌ కాల్స్ రావు

  • ఆధార్ కార్డుతో మొబైల్ నంబర్ లింక్ చేసిన తర్వాతే ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి.

  • వాట్సాప్‌ ద్వారా అందజేసే సేవల్లో పౌరుల సమాచారాన్ని మెటా స్టోర్ చేయదు.

  • మెటా డేటా సర్వర్లను ఏపీ ప్రభుత్వ పర్యవేక్షణ, సంరక్షణలోనే ఏర్పాటు చేస్తారు.

  • వ్యక్తి గోప్యతకు అధిక ప్రాధాన్యం ఇస్తారు.

  • రాష్ట్రానికి సంబంధించిన సేవలను వాట్సాప్‌ మనమిత్రలో జత చేస్తారు

  • పేర్ల మార్పులు తదితర సేవల అంశంలో చట్టపరంగా ఉన్న అంశాలను సంబంధిత అధికారులు పరిశీలిస్తారు.

  • కొన్ని రకాల సేవలను తక్కువ సమయంలో అందిస్తారు.

  • మానవ ప్రమేయం లేకుండా వాట్సాప్‌ ద్వారా పౌర సేవలను త్వరగా అందించడానికి కృషి చేస్తారు.

  • వాట్సాప్‌ పౌర సేవల ద్వారా ఉద్యోగ భద్రతకు ఎలాంటి ఇబ్బంది రానీవకుండా చర్యలు చేపట్టారు.

  • గతంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాల్లో దరఖాస్తు చేసే విధానంలో ఎలాంటి మార్పు ఉండదు.

  • అయితే వాట్సాప్‌లో అందించే పౌర సేవలపై ప్రజలకు ఫిర్యాదు చేసేందుకు ఎలాంటి అవకాశం కల్పించలేదు.


ఈ వార్తలు కూడా చదవండి...

Investments in AP: ఏపీలో భారీ పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్.. అత్యధికం ఎక్కడంటే

Maha Kumbh Mela: మీ ఊరి నుంచే కుంభమేళాకు బస్సు.. భక్తుల కోసం బంపర్ ఆఫర్

Tribute.. జాతిపిత మహాత్మాగాంధీకి సీఎం చంద్రబాబు నివాళులు

AP News: ఏపీలో అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల క్రమబద్దీకరణ

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 30 , 2025 | 04:38 PM