చరిత్ర పొడుగునా...
ABN , Publish Date - Jan 31 , 2025 | 02:09 AM
పారదర్శకమైన పదాల వెనకే దాగివున్న రహస్యాలు, వాక్యవిన్యాసంతో మాయచేసే వ్యాఖ్యానాలు సంస్థాగత గోడలన్నీ మరిన్ని విస్తరిస్తున్నా భూగోళంపై...

పారదర్శకమైన పదాల వెనకే
దాగివున్న రహస్యాలు,
వాక్యవిన్యాసంతో
మాయచేసే వ్యాఖ్యానాలు
సంస్థాగత గోడలన్నీ
మరిన్ని విస్తరిస్తున్నా భూగోళంపై
ఆర్థిక విశ్లేషణలతో
మురిసిపోడమే మిగిలింది!
పరిష్కారాలు ఎన్నివున్నా
అగ్రరాజ్యాల ఆధిపత్యం విస్తరించిన
ఆఫ్రికా, ఆసియా ఖండాల–
సుదీర్ఘ ఆకలియాత్రలలో
తెగల–మతాల సంకుల సమరంలో
తెగిన తలలు చెప్పిన రహస్యాలు
చరిత్రపొడుగునా
ఎండిన రక్తపుటేరుల జాడలే!!
నిఖిలేశ్వర్
పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి