Share News

CM Chandrababu: దేశంలోనే తొలిసారంటూ సీఎం చంద్రబాబు సంచలన ట్వీట్

ABN , Publish Date - Jan 30 , 2025 | 09:05 PM

CM Chandrababu: వాట్సాప్ గవర్నరెన్స్‌పై సీఎం చంద్రబాబు కీలక ట్వీట్ చేశారు. మనమిత్ర పేరుతో వాట్సాప్ గవర్నెన్స్‌కు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని చెప్పారు. దీని ద్వారా 161 పౌర సేవలు ఫింగర్ టిప్స్‌పై లభించునున్నాయని తెలిపారు. ఈ నిర్ణయం ప్రభుత్వం పాలనలో చిత్తశుద్ధికి నిదర్శనమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

CM Chandrababu: దేశంలోనే తొలిసారంటూ సీఎం చంద్రబాబు సంచలన ట్వీట్
CM Chandrababu Naidu

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌‌లో వాట్సాప్ సేవలను గురువారం నాడు ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది. ఇక నుంచి ప్రభుత్వ ధ్రువపత్రాలన్నీ వాట్సాప్ ద్వారానే ప్రజలకు అందేలా చర్యలు తీసుకుంటుంది. వాట్సాప్ సేవల కోసం ఓ నెంబర్‌ను విడుదల చేసింది. వాట్సాప్ గవర్నెన్స్ కోసం నెంబర్ 9552300009ను వినియోగించుకోవాలని సూచించింది. దేశంలోనే తొలిసారి వాట్సాప్ గవర్నెన్స్‌ ద్వారా పౌర సేవలు అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మొదటి విడతలో 161 సేవలను వాట్సాప్ ద్వారా అందించనుంది. తొలి విడతలో దేవాదాయ, విద్యుత్ శాఖ, ఆర్టీసీ, రెవెన్యూ, అన్నా క్యాంటీన్, సీఎంఆర్ఎఫ్, మున్సిపల్ శాఖల్లో ఈ సేవలను ఏపీ ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. ఈ మేరకు వాట్సాప్ గవర్నెన్స్‌పై సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) సామాజిక మాధ్యమం ఎక్స్‌లో కీలక ట్వీట్ చేశారు.

CM-CHANDRABABU--1.jpg


చిత్తశుద్ధికి నిదర్శనం

‘‘మనమిత్ర పేరుతో వాట్సాప్ గవర్నెన్స్‌కు ఏపీ ప్రభుత్వం శ్రీకారం. దీని ద్వారా 161 పౌర సేవలు ఫింగర్ టిప్స్‌పై లభించనున్నాయి. ఈ నిర్ణయం ప్రభుత్వం పాలనలో చిత్తశుద్ధికి నిదర్శనం. యువగలం సందర్భంగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మదిలో మెదిలిన ఆలోచనలో భాగంగా వాట్సాప్ గవర్నెన్స్‌కు శ్రీకారం చుట్టాం. వాట్సాప్ గవర్నెన్స్ కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత మంత్రి లోకేష్ తో పాటు ఇండియాలో మెటా వైస్ ప్రెసిడెంట్ సంధ్యా దేవనాథన్ నన్ను కలిశారు. ఇండియాలోనే తొలిసారి వాట్సాప్ గవర్నెన్స్‌కు శ్రీకారం చుట్టిన ప్రభుత్వంగా ఏపీ నిలుస్తుంది’’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

CM-CHANDRABABU---2.jpg


రిజిస్ట్రేషన్ విలువల సవరణకు ప్రభుత్వం కీలక ఆదేశాలు

రాజమండ్రి: ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్‌‌లో గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ విలువల సవరణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రిజిస్ట్రేషన్ల కోసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు కక్షిదారులు క్యూ గట్టారు. దీంతో రాత్రిపూట రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి. సర్వర్ స్లోగా ఉండటంతో రిజిస్ట్రేషన్లకు ఎక్కువ సమయం పడుతుందని కక్షిదారులు తెలిపారు.


పశ్చిమగోదావరి జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన

పశ్చిమగోదావరి: పశ్చిమగోదావరి జిల్లాలోని పెనుగొండలో రేపు(శుక్రవారం) సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. వాసవిమాత ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో అధికారికంగా పట్టు వస్త్రాలను సీఎం చంద్రబాబు సమర్పించనున్నారు. సీఎం పర్యటనతో అధికారులు అప్రమత్తమయ్యారు. సీఎం చంద్రబాబు పెనుగొండకు వస్తుండటంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హెలిప్యాడ్ వద్ద హెలికాప్టర్‌తో అధికారులు ట్రైల్‌రన్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఎప్పటికప్పుడు అధికారులతో పర్యవేక్షణ చేస్తున్నారు. పెనుగొండ వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు ఉదయం 11:15 గంటలకు సీఎం చంద్రబాబు చేరుకోనున్నారు. నగరేశ్వర మహిషాసుర మర్దిని వాసవి మాతకు పట్టు వస్త్రాలను ముఖ్యమంత్రి చంద్రబాబు సమర్పించనున్నారు.


ముఖ్యమంత్రి చంద్రబాబుతో వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ భేటీ

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఇవాళ ఏపీ సచివాలయంలో వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ భేటీ అయ్యారు. వక్ఫ్ బోర్డ్ సమస్యలపై చంద్రబాబుకు వినతిపత్రం ఇచ్చారు. ఏపీ వక్ఫ్ బోర్డ్‌కు తెలంగాణ నుంచి రావాల్సిన రూ.50 కోట్లు బకాయిలు ఇప్పించాలని కోరారు. తెలంగాణలోని ఏపీ వక్ఫ్ బోర్డ్ రికార్డులను తెప్పించాలని అన్నారు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం రూ.50 కోట్లు, మసీదుల మరమ్మత్తులకు రూ.10 కోట్లు మంజూరు చేయాలని చెప్పారు. ఆదాయం లేని 1500 మసీదుల పెండింగ్ దరఖాస్తులను మంజూరు చేయాలని కోరారు. బారాషహీద్ దర్గా అభివృద్ధికి నిధులు విడుదల చేయాలని కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి...

Investments in AP: ఏపీలో భారీ పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్.. అత్యధికం ఎక్కడంటే

Maha Kumbh Mela: మీ ఊరి నుంచే కుంభమేళాకు బస్సు.. భక్తుల కోసం బంపర్ ఆఫర్

Tribute.. జాతిపిత మహాత్మాగాంధీకి సీఎం చంద్రబాబు నివాళులు

AP News: ఏపీలో అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల క్రమబద్దీకరణ

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 30 , 2025 | 09:19 PM