ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి
ABN , Publish Date - Jan 31 , 2025 | 01:28 AM
డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు డిమాండ్ చేశారు.

ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు
చింతపల్లి, హాలియా, నిడమనూరు, జనవరి 30(ఆంధ్రజ్యోతి): డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు డిమాండ్ చేశారు. జిల్లాలోని పలు మండలాల్లో ఆయన గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీని మరింత బలోపేతం చేయడానికి కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. ఫిబ్రవరి మొద టి వారంలో కమిటీలను ఏర్పాట చేయనున్నట్లు తెలిపారు. నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గంలో సభ్యత్వ నమోదును పెద్ద ఎత్తున చేపట్టినట్లు చెప్పారు. లక్ష లో పు సభ్యత్వాలు నమోదు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటికే 50వేల సభ్యత్వా లు పూర్తయినట్లు పేర్కొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అన్నీ స్థా నాలకు పోటీ చేసేందుకు కార్యాచరణ తయారు చేశామన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరడం ఖాయమన్నారు. చింతపల్లి మండలం వెంకటేశ్వరనగర్(మాల్)లో నిర్వహించిన సమావేశంలో కార్యక్రమంలో వుప్పల రమేష్, పుట్టబత్తుల విజయ్‌కుమార్(డాక్టర్), శ్రీధర్, సిద్ధగోని నరసింహ, రెడ్డగోని పెద్దయ్య, దోటి సంతోష్, సాలయ్య, బాలయ్య, అబ్బయ్య, వెంకటేష్ పాల్గొన్నారు.
హాలియాలో నియోజకవర్గ ఇనచార్జి మువ్వా అరుణ్‌కుమార్ ఆధ్వర్యంలో టీ డీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్లు ఉడుతూరి నర్సింహారెడ్డి, మందా తిరుపతయ్య, సబ్బు బలరాంరెడ్డి, కొట్టే శ్రీను, జమీల్, సైదులు, బిక్షం, వెంకన్న, రామస్వామి, రవి, ఉపేందర్, సక్రునాయక్, హరినాయక్, దాసరి శ్రీను, అనంతయ్య, సతీష్, రూబెన పాల్గొన్నారు.
నిడమనూరు మాజీ ఎంపీపీ యడవెల్లి రంగశాయిరెడ్డి అకాల మృతి బాధాకరమని బక్కని నర్సింహులు అన్నారు. మండలంలోని తుమ్మడం గ్రామంలోని ఆ యన నివాసానికి వెళ్లి పలువురు నాయకులతో కలిసి రంగశాయిరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయనతో తనకు మొదటి నుంచి మంచి అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన అంకతి సత్యం, నాయకులు మందా తిరుపతయ్య, విక్రమ్‌రెడ్డి, యడవెల్లి వల్లభ్‌రెడ్డి, నర్సింహారెడ్డి, ఉపేందర్, ముద్దా అనిల్, సైదులు తదితరులు పాల్గొన్నారు.