Share News

షెడ్యూల్‌ ఖరారుతో రాజకీయ వేడి

ABN , Publish Date - Jan 31 , 2025 | 01:25 AM

కరీంనగర్‌, మెదక్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్‌ విడుదల కావడంతో రాజకీయ సందడి మొదలైంది.

షెడ్యూల్‌ ఖరారుతో రాజకీయ వేడి

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

కరీంనగర్‌, మెదక్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్‌ విడుదల కావడంతో రాజకీయ సందడి మొదలైంది. అభ్యర్థుల ఖరారుపై పార్టీ దృష్టి పెట్టాయి. ఈ మేరకు కసరత్తు లు ప్రారంభించాయి. గురువారం మీడియాతో మా ట్లాడిన రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీదర్‌బాబు పట్టభద్రు ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్సీ టి జీవన్‌రెడ్డి పోటీ చేయరని, అభ్యర్థి ఎవరన్నది ఒకటి రెండు రోజుల్లో ప్రకటిస్తామని వెల్లడించారు. అల్ఫోర్స్‌ విద్యా సంస్థల అధినేత డాక్టర్‌ వి నరేందర్‌రెడ్డి వైపు పార్టీ నేతలు మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోం ది. నేడో, రేపో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అధికారి కంగా అభ్యర్థిని ప్రకటించే అవకాశ మున్నదని సమాచారం. టీపీసీసీ నుంచి ఈ స్థానానికి సిట్టింగ్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పేరునే పంపించారు. జీవన్‌రెడ్డి తాను పోటీలో ఉండబోనని ఏఐసీసీకి తెలిపారు. నరేందర్‌రెడ్డి మొదట జీవన్‌రెడ్డి వద్దకు వెళ్లి ఆయన పోటీ చేసే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జీవన్‌ రెడ్డి పోటీకి పెద్దగా ఆసక్తి చూపించలేదని ప్రచారం జరిగింది.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల గురించి టీపీసీసీలో సమావేశం జరిగిన సందర్భంలో తన రాజకీయ భవిష్యత్‌ గురించి జీవన్‌రెడ్డి ప్రశ్నించడంతో ఆయన తిరిగి పోటీలో ఉంటారేమోనని భావించారు. గురువారం శ్రీధర్‌బా బు ప్రకటనతో ఆయన పోటీ చేయరని స్పష్టత వచ్చింది. కాగ్రెస్‌ అధిష్ఠానం ఇప్పటికే అల్ఫోర్స్‌ విద్యా సంస్థల చైర్మన్‌ నరేందర్‌రెడ్డి, ప్రసన్న హరికృష్ణ పేర్లను పరిశీలించి క్షేత్ర స్థాయిలో సమాచారాన్ని సేకరించారు. ఈ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే 42 అసెంబ్లీ స్థానాల్లో పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు, పార్టీ ఎంపీల అభిప్రాయాలు తెలుసుకొని నరేందర్‌రెడ్డి పేరును ఖరారు చేయాలనికి నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజక వర్గంలో ఇప్పటి వరకు 3.47 లక్షల ఓట్లు నమోదు కాగా అందులో సగం మ్మడి జిల్లాకు చెందినవే ఉన్నాయి. దీంతో ఈ జిల్లా వాసినే అభ్యర్థిగా నిలిపితే గెలుపు సాధించవచ్చని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. నరేం దర్‌రెడ్డి అందరి కంటే ఎక్కువ ఓట్లు నమోదు చేయించు కున్నారు. ఈ అంశం ఆయనకు కలిసి వచ్చే అవకాశం ఉంది.

బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా సర్దార్‌ రవీందర్‌సింగ్‌?

కరీంనగర్‌ పట్టభద్రుల నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా మాజీ మేయర్‌, సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ సర్దార్‌ రవీందర్‌సింగ్‌ను నిలపాలని ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ భావిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌ అభ్యర్థి పేరు వెల్లడి కాగానే తమ అభ్యర్థిని ప్రకటించాలని బీఆర్‌ఎస్‌ నాయకత్వం భావిస్తోందని తెలిసింది. రవీందర్‌సింగ్‌ అభ్యర్థిత్వంపై కేటీఆర్‌, హరీష్‌రావు, కవిత సుముఖంగా ఉన్నారని సమాచారం. అభ్యర్థిని నిలిపితే ఉద్యమకారుడు అయిన రవీందర్‌సింగ్‌కే అవకాశం కల్పించాలని కేసీఆర్‌కు సూచించినట్లు సమాచారం. కరీంనగర్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్‌ ఇదే తన అభిప్రాయంగా కేటీఆర్‌ దృష్టికి తీసుకువెళ్లారని తెలిసింది. ఈ రోజు లేదా రేపటికి రవీందర్‌సింగ్‌ పేరును పార్టీ ప్రకటించే అవకాశ ముందని పార్టీ వర్గాలు పేర్కొంటు న్నాయి.

Updated Date - Jan 31 , 2025 | 01:25 AM