Share News

Chandrababu Fires ON jagan: వివేకా హత్య తరహాలోనే జగన్ అండ్ కో కల్తీ మద్యం వ్యవహారం: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Oct 13 , 2025 | 09:43 PM

ఏపీలో జగన్‌ పార్టీ అంతా క్రిమినల్‌ కార్యకలాపాలకు పెట్టింది పేరుగా ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. వైసీపీ నేతలు నేరాలు చేసి... వాటిని తెలుగుదేశం నేతల మీదకు నెట్టడం పరిపాటిగా మారిందని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు.

Chandrababu Fires ON jagan: వివేకా హత్య తరహాలోనే జగన్ అండ్ కో కల్తీ మద్యం వ్యవహారం: సీఎం చంద్రబాబు
CM Chandra babu Fires ON jagan

ఢిల్లీ, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy)పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandra babu Naidu) సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు (Viveka Reddy Case) తరహాలోనే.. ఏపీలో ఇప్పుడు జగన్ అండ్ కో కల్తీ మద్యం వ్యవహారం (AP Fake Liquor Case) ఉందని షాకింగ్ కామెంట్స్ చేశారు.


టీడీపీ ఎంపీలతో సీఎం చంద్రబాబు భేటీ..

ఇవాళ(సోమవారం) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi)తో ఢిల్లీలో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సమావేశం ముగిసిన అనంతరం తెలుగుదేశం పార్టీ ఎంపీలతో కాసేపు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఎంపీలతో చంద్రబాబు పలు కీలక అంశాలపై చర్చించారు. మూర్ఖుడు, క్రూరుడు అన్న పదాలు... జగన్‌ అండ్ కోకు మాత్రమే వర్తిస్తాయని ఎద్దేవా చేశారు సీఎం చంద్రబాబు.


క్రిమినల్‌ కార్యకలాపాలకు పెట్టింది పేరు..

జగన్‌వి ఇంకా చాలా నేర కార్యకలాపాలు ఉన్నాయని ఆక్షేపించారు. ఏపీలో జగన్‌ పార్టీ అంతా క్రిమినల్‌ కార్యకలాపాలకు పెట్టింది పేరుగా ఉందని విమర్శించారు. వైసీపీ నేతలు నేరాలు చేసి... వాటిని తెలుగుదేశం నేతల మీదకు నెట్టడం పరిపాటిగా మారిందని ధ్వజమెత్తారు. క్రిమినల్‌ మాస్టర్‌ మైండ్‌ ఎలా ఉంటుందో జగన్‌ ఉదాహరణ అని చెప్పుకొచ్చారు. వివేకా హత్య తరహాలో.... ఇప్పుడు మళ్లీ నేరాలు, ఘోరాలు చేసి ఏపీలో అలజడి సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు సీఎం చంద్రబాబు.


అప్రమత్తంగా ఉండాలి..

టీడీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు. జగన్ అండ్ కో క్రిమినల్‌ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఇప్పుడు కల్తీ మద్యం వ్యవహారం కూడా అలాగే చేశారని విమర్శించారు. పోలీసు అధికారులు దర్యాప్తు సమగ్రంగా చేస్తున్న కొద్దీ అనేక విషయాలు బయటపడుతున్నాయని చెప్పుకొచ్చారు. జగన్ అండ్ కో చేసిన నేరాన్ని తెలుగుదేశం నేతల మీదకు నెట్టేందుకు అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నారని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

నాపై కుట్రలు చేశారు... వినుత కోట ఎమోషనల్

ఏపీ పర్యాటక రంగానికి జాతీయ గుర్తింపు దిశగా అడుగులు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 13 , 2025 | 10:02 PM