Share News

AP Fake Liquor Case: జోగి రమేష్ నకిలీ మద్యం తయారు చేయమన్నారు: జనార్దన్ రావు

ABN , Publish Date - Oct 13 , 2025 | 06:34 PM

ఏపీ నకిలీ మద్యం కేసులో సంచలన విషయాలు బయటపెట్టారు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న జనార్దన్ రావు. వైసీపీ పాలనలో జోగి రమేష్ ఆధ్వర్యంలో నకిలీ మద్యం తయారీ చేసినట్టు చెప్పారు.

AP Fake Liquor Case: జోగి రమేష్ నకిలీ మద్యం తయారు చేయమన్నారు: జనార్దన్ రావు
AP Fake Liquor Case

ఇంటర్నెట్ డెస్క్: ఏపీ నకిలీ మద్యం కేసులో సంచలన విషయాలు బయటపెట్టారు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న అద్దేపల్లి జనార్దన్ రావు. వైసీపీ పాలనలో జోగి రమేష్ ఆధ్వర్యంలో నకిలీ మద్యం తయారీ చేసినట్టు ఆయన చెప్పారు. అయితే, ఏపీలో ప్రభుత్వం మారగానే నకిలీ మద్యం తయారీ నిలిపివేశామని జనార్దన్ రావు చెప్పుకొచ్చారు. నకిలీ మద్యం తయారీ వెనుక జరిగిన అన్ని విషయాల్నీ జనార్దన్‌రావు ఒక వీడియో రూపంలో వెల్లడించారు. ఇప్పుడు ఈ వీడియో రాజకీయ వర్గాలను కుదిపేస్తోంది.


అయితే, ఈ ఏడాది ఏప్రిల్‌లో జోగి రమేష్ మళ్లీ నకిలీ మద్యం తయారు చేయమన్నారని జనార్దన్ రావు వెల్లడించారు. 'కూటమి ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించే కుట్రతో.. మళ్లీ నకిలీ మద్యం తయారీ మొదలు పెట్టాలని జోగి రమేష్ నాతో చెప్పారు. ఇబ్రహీంపట్నంలో పెట్టాలని అనుకున్నా కానీ, జోగి రమేష్ ఆదేశాలతో తంబళ్లపల్లె నియోజకవర్గంలో నకిలీ మద్యం తయారీ మొదలుపెట్టాం. తంబళ్లపల్లె నుంచి ప్రారంభిస్తే ప్రభుత్వంపై బురద జల్లొచ్చని జోగి రమేష్ అన్నారు. రూమ్ అద్దెకు తీసుకొని లిక్కర్ తయారీకి అన్ని యంత్రాలు తీసుకొచ్చాం. ఆర్థిక ఇబ్బందులు నుంచి బయట పడేస్తానని జోగి రమేష్ నాకు హామీ ఇచ్చారు. అంతా రెడీ అయ్యాక నన్ను ఆఫ్రికాలో ఉన్న ఫ్రెండ్ దగ్గరకు పంపారు. జోగి రమేష్ తన మనుషుల ద్వారా లీక్ ఇచ్చి రైడ్ చేయించారు. తద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని కుట్ర చేశాడు' అని జనార్థన్ రావు సంచలన విషయాలు బయటపెట్టారు.


అంతేకాదు, 'టీడీపీ నేతలను సస్పెండ్ చేయడంతో జోగి రమేష్ మరో ప్లాన్ వేశారు. ఇబ్రహీంపట్నంలోనూ రైడ్ చేయిద్దామని, సరకు అక్కడికి తీసుకొచ్చిపెట్టు అని చెప్పారు. జోగి రమేష్ చెప్పినట్టే లీక్ ఇచ్చి రైడ్ చేయించారు. అప్పుడు సాక్షి మీడియా ముందే వచ్చింది.. అనుకున్నది జరిగింది.. ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చింది. నువ్వు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదని జోగి రమేష్ అన్నారు. అంతా చూసుకుంటా బెయిల్ ఇప్పిస్తానని చెప్పి జోగి రమేష్ హ్యాండ్ ఇచ్చాడు. నా తమ్ముడిని కూడా నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ ఇరికించాడు. జైచంద్రారెడ్డికి నకిలీ మద్యంతో అసలు సంబంధం లేదు' అని జనార్దన్ రావు చెప్పారు.


ఇవి కూడా చదవండి..

జువైనల్ హోంలో లైంగిక దాడిపై పోలీసులు ఏం తేల్చారంటే

సంక్షేమ హాస్టళ్లపై ముఖ్యమంత్రి రేవంత్ కీలక సూచనలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 13 , 2025 | 07:18 PM