Juvenile Home Minor Abuse: జువైనల్ హోంలో లైంగిక దాడిపై పోలీసులు ఏం తేల్చారంటే
ABN , Publish Date - Oct 13 , 2025 | 10:59 AM
ఇప్పటికే బాధిత బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం స్టాఫ్ గార్డ్ రెహమాన్ పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం.
హైదరాబాద్, అక్టోబర్ 13: సైదాబాద్ అబ్జర్వేషన్ హోంలో (Saifabad Observation Home) లైంగిక దాడి నిజమే అని పోలీసులు నిర్ధారించారు. మైనర్ బాలుడిపై లైంగిక దాడి జరిగినట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయ్యింది. మైనర్ బాలుడిపై స్టాఫ్ గార్డ్ రహమాన్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. హోంలో మరో ఐదుగురిపై కూడా లైంగిక దాడి జరిగినట్టు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో ఐదుగురు బాలురను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వారికి వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే బాధిత బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం స్టాఫ్ గార్డ్ రెహమాన్ పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం.
అంతేకాకుండా... ఎంతకాలంగా అబ్జర్వేషన్ హోంలో మైనర్ బాలురపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడన్న కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. జువైనల్ హోంలో లైంగిక దాడి ఘటనపై మహిళా శిశు సంక్షేమ శాఖ సీరియస్ అయ్యింది.
మరోవైపు.. బాలసదన్‌కు సైదాబాద్ పోలీసులు చేరుకున్నారు. లైంగిక దాడి ఘటనపై వివరాలను సైదాబాద్ ఇన్స్పెక్టర్, మహిళ ఎస్సై సేకరిస్తున్నారు. బాలసదన్ సూపరింటెండెంట్‌తో వివరాలు సేకరించారు. రెహమాన్ ఎంతకాలంగా పనిచేస్తున్నారని.. అతని ప్రవర్తనపై వివరాలు ఆరా తీస్తున్నారు పోలీసులు.
ఇవి కూడా చదవండి..
టీడీపీలోకి వచ్చిన ఆ నేతలకు ఎమ్మెల్యే బండారు స్ట్రాంగ్ వార్నింగ్
రైతులతో కలిసి సీఆర్డీఏ భవనాన్ని ప్రారంభించిన సీఎం
Read Latest Telangana News And Telugu News