Chandrababu CRDA Office Inauguration: రైతులతో కలిసి సీఆర్డీఏ భవనాన్ని ప్రారంభించిన సీఎం
ABN , Publish Date - Oct 13 , 2025 | 10:09 AM
రాజధాని పనులు రీ-స్టార్ట్ అయ్యాక ప్రారంభమైన తొలి ప్రభుత్వ భవనం ఇది. భవనాన్ని ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి పరిశీలీస్తుండగా... భవన నిర్మాణ తీరును మంత్రి నారాయణ వివరించారు.
అమరావతి, అక్టోబర్ 13: అమరావతిలోని సీఆర్డీయే కార్యాలయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఈరోజు (సోమవారం) ప్రారంభించారు. భూములిచ్చిన రైతులతో కలిసి ఉదయం 9.54 గంటలకు భవనాన్ని ప్రారంభించారు సీఎం. వేదమంత్రోచ్ఛారణల మధ్య భవనాన్ని ముఖ్యమంత్రి ఓపెన్ చేశారు. ఈ సందర్భంగా సీఎంకు పండితులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. రాజధాని పనులు రీ-స్టార్ట్ అయ్యాక ప్రారంభమైన తొలి ప్రభుత్వ భవనం ఇది. భవనాన్ని ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి పరిశీలీస్తుండగా... భవన నిర్మాణ తీరును మంత్రి నారాయణ (Minister Narayana) వివరించారు.
G+7 భవనంతో పాటు మరో నాలుగు పీఈబీ భవనాలను ప్రభుత్వం నిర్మించింది. సీఆర్డీయే, ఏడీసీఎల్‌తో పాటు మున్సిపల్ శాఖకు సంబంధించిన అన్ని విభాగాలు ఒకే చోట నుంచి కార్యకలాపాలు నిర్వహించేలా నిర్మాణాలు చేసింది సర్కార్. భవనం ప్రారంభానికి ముందు భూములిచ్చిన రైతులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. రైతులు భూములిచ్చి రాజధాని నిర్మాణానికి సహకరించారని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో మరోసారి చిరుత కలకలం..
టీడీపీలోకి వచ్చిన ఆ నేతలకు ఎమ్మెల్యే బండారు స్ట్రాంగ్ వార్నింగ్
Read Latest AP News And Telugu News