Jubilee Hills Bypoll: కాకరేపుతున్న బైపోల్.. బీజేపీ అభ్యర్థి ఫిక్స్!
ABN , Publish Date - Oct 13 , 2025 | 10:29 AM
సామాజిక సమీకరణాలు, పార్టీ గెలుపు దృష్ట్యా అభ్యర్ధి విషయంలో బీజేపీ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణ కాషాయ పార్టీ తరఫున ముగ్గురు పేర్లు కేంద్ర కమిటికీ అందాయి. ఆదివారం ఢిల్లీలో జరిగిన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో జూబ్లీహిల్స్ బై పోల్ లో బీజేపీ అభ్యర్థిగా దీపక్‌రెడ్డి పేరును పార్టీ అగ్రనాయకత్వం ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. జూబ్లీహిల్స్‌లో పోటీ కోసం దీపక్‌రెడ్డి, కీర్తిరెడ్డి, మాధవీలత పేర్లతో కూడిన జాబితాను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు శనివారమే పార్టీ జాతీయ నాయకత్వానికి అందివ్వగా.. ఈ ముగ్గురి ఎంపికపై చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
హైదరాబాద్, అక్టోబర్ 13: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కాకరేపుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఇక్కడ బైఎలెక్షన్ జరుగనుంది. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు సైతం ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పదేండ్లు అధికారంలో ఉన్న బీఅర్ఎస్‌ను ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కించుకుంది. అటు పార్లమెంట్ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్‌ను చిత్తు చిత్తుగా ఓడించి 8 పార్లమెంట్ స్థానాల్లో విజయ బావుటా ఎగురవేసింది. మరోవైపు బీజేపీ కూడా ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసి ఆశ్చర్యపోయే విధంగా 8 స్థానాలు గెలుచుకుంది. త్వరలో జరుగనున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో తమ ప్రతాపాన్ని చూపేందుకు ఈ మూడు పార్టీలు రెడీ అవుతున్నాయి. విజయ కాంక్ష కోసం తహతహలాడుతున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ బై పోల్ లో కూడా గెలిచి మరోమారు తమ సత్తా ఏంటో చూపేందుకు సమాయత్తం అవుతుంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి మూటగట్టుకున్న బీఆర్ఎస్.. పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు కసరత్తు చేస్తుంది.
ఈ తరుణంలోనే బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. జూబ్లీహిల్స్ అభ్యర్ధి విషయంలో బీజేపీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ ముందుగానే తమ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ భార్య, మాగంటి సునీతను ఎన్నికల బరిలో నిలుపుతున్నట్లు ప్రకటించింది. అటు కాంగ్రెస్ అధిష్టానం సైతం అనేక మార్లు సమాలోచనలు చేసి హస్తం పార్టీ అభ్యర్థిగా నవీన్ యాదవ్ ను ఎంపిక చేసింది. వీరిద్దరూ తమ ప్రచారాన్ని రోజురోజుకీ ముమ్మరం చేస్తున్నారు. స్థానికులను కలిసి తమకు ఓటు వేసి ఆశీర్వదించాలని కోరుతున్నారు. పోటీ నుంచి తెలుగు దేశం పార్టీ తప్పుకోవటంతో బీజేపీ ఎవరిని బరిలోకి దించుతుందనే చర్చ మొదలైంది. అధిష్టానం పెద్దలలో చర్చలు జరిపి అభ్యర్థి విషయంలో ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది.
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ ఈరోజు విడుదల కానుంది. నోటిఫికేషన్ జారీ తర్వాత నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. సోమవారం ఉదయం 11 గంటల నుంచి 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉన్నట్లు జల్లా ఎన్నికల అధికారి తెలిపారు. ఈ నేపథ్యంలో సామాజిక సమీకరణాలు, పార్టీ గెలుపు దృష్ట్యా అభ్యర్ధి విషయంలో బీజేపీ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణ కాషాయ పార్టీ తరఫున ముగ్గురు పేర్లు కేంద్ర కమిటికీ అందాయి. ఆదివారం ఢిల్లీలో జరిగిన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో జూబ్లీహిల్స్ బై పోల్ లో బీజేపీ అభ్యర్థిగా దీపక్‌రెడ్డి పేరును పార్టీ అగ్రనాయకత్వం ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. జూబ్లీహిల్స్‌లో పోటీ కోసం దీపక్‌రెడ్డి, కీర్తిరెడ్డి, మాధవీలత పేర్లతో కూడిన జాబితాను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు శనివారమే పార్టీ జాతీయ నాయకత్వానికి అందివ్వగా.. ఈ ముగ్గురి ఎంపికపై చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
తొలుత బీజేపీ జూబ్లీహిల్స్ అభ్యర్దిగా దీపక్ రెడ్డి పేరు ఖరారు చేసినా.. చివరి నిమిషంలో ప్రకటించకుండా మరింత చర్చ చేస్తున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో లక్ష మంది ముస్లిం ఓటర్లు ఉన్న నేపథ్యంలో ఎవరికి బరిలోకి దించాలన్న దానిపై కసరత్తు చేశారు. హైదరాబాద్ లోక్‌సభ స్థానంలో పోటీచేసిన మాధవీలతను పోటీకి దింపితే ఎలా ఉంటుంది అనే దానిపై కూడా చర్చించారు. రాష్ట్ర నాయకత్వం నుంచి దీపక్ రెడ్డి సరైన అభ్యర్దిగా సూచన రావటంతో ఈ ఇద్దరిలో ఒకరి పేరును ఈ రోజు బీజేపీ అధికారికంగా ప్రకటన చేయనుంది. దీపక్ రెడ్డి 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ జూబ్లీహిల్స్ నుంచి బీజేపీ అభ్యర్దిగా పోటీ చేసారు. అయితే ఈ ఎన్నికలో 25,866 ఓట్లు మాత్రమే సాధించారు. బీజేపీ అభ్యర్థి సైతం ఫిక్స్ అవ్వడంతో మూడు ప్రధాన పార్టీలు బై పోల్ ఎన్నికలో నువ్వా నేనా అన్నట్లుగా తలపడనున్నాయి.
ఇవి కూడా చదవండి:
Jubilee Hills By-Election: నేటి నుంచి జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్ల స్వీకరణ..
Ham Roads: తెలంగాణలో హ్యామ్ రోడ్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. నిధులు విడుదల