AP High Court ON Police: ఏపీ పోలీస్ శాఖ ఇలాగేనా.. హైకోర్టు ప్రశ్నల వర్షం
ABN , Publish Date - Oct 13 , 2025 | 06:54 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు శాఖను మూసివేయడం మేలని ఏపీ హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో డీజీపీ, పోలీసు శాఖ నిద్రపోతోందని.. పోలీసు వ్యవస్థ పనిచేసేది ఇలాగేనా అని ప్రశ్నించింది ఏపీ హైకోర్టు.
అమరావతి, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు శాఖ (Andhra Pradesh Police)ను మూసివేయడం మేలని ఏపీ హైకోర్టు (AP High Court) అభిప్రాయం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో డీజీపీ, పోలీసు శాఖ నిద్రపోతోందని.. పోలీసు వ్యవస్థ పనిచేసేది ఇలాగేనా అని ప్రశ్నించింది. తిరుపతి పరకామణి కేసు విచారణ (Tirupati Parkamani investigation) సందర్భంగా పోలీసు శాఖ పనితీరుపై నిప్పులు చెరిగింది హైకోర్టు. రికార్డులు సీజ్ చేయమని సెప్టెంబర్ 19వ తేదీన ఉత్తర్వులు ఇచ్చినా ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నల వర్షం కురిపించింది.
సీఐడీలో ఐజీ పోస్టు లేదనే కారణంతో ఆదేశాలు అమలు చేయరా..? అని నిలదీసింది. నిబద్ధత ఉంటే ఐజీ స్థాయి అధికారిని నియమించి రికార్డులు సీజ్ చేయమని డీజీపీ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చేవారని స్పష్టం చేసింది. ఈ కేసు దర్యాప్తులో కీలకమైన రికార్డులను సీజ్ చేయడంలో డీజీపీ విఫలం అయ్యారని ఫైర్ అయింది ఏపీ హై కోర్టు.
ఆ ఆధారాలను తారుమారు చేసేందుకు వీలుగా తప్పు చేసిన వారికి పోలీసులు సహకరించారని ఆరోపించింది. పోలీసు శాఖ చర్యలే ఈ కేసులో ఎంత నిజాయితీగా వ్యవహరించాయో చెబుతున్నాయని ఎద్దేవా చేసింది. రికార్డులు సీజ్ చేసి హైకోర్టు ముందు ఉంచాలని సీఐడీ డీజీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ విచారణ అక్టోబర్ 17వ తేదీకి వాయిదా వేసింది. పరకామణిలో అక్రమాలపై ఇచ్చిన ఆదేశాలు అమలు చేయకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఏపీ హైకోర్టు.
ఈ వార్తలు కూడా చదవండి...
నాపై కుట్రలు చేశారు... వినుత కోట ఎమోషనల్
ఏపీ పర్యాటక రంగానికి జాతీయ గుర్తింపు దిశగా అడుగులు
Read Latest AP News And Telugu News