Share News

Chandrababu Meets MODI: ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

ABN , Publish Date - Oct 13 , 2025 | 06:00 PM

ప్రధానమంత్రి నరేంద్రమోదీతో దేశ రాజధాని ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు.

Chandrababu Meets MODI: ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ
CM Chandrababu Meets PM MODI

అమరావతి, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi)తో దేశ రాజధాని ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu), మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ భేటీ దాదాపు 40 నిమిషాల పాటు జరిగింది.


కర్నూలులో తలపెట్టిన సూపర్ జీఎస్టీ - సూపర్ సేవింగ్స్ కార్యక్రమానికి ప్రధాని మోదీని ఆహ్వానించారు సీఎం చంద్రబాబు. అలాగే, నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరుగనున్న సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్‌కు మోదీని ఆహ్వానించారు. మరోవైపు ఢిల్లీలో రేపు (మంగళవారం) గూగుల్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకునే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పాల్గొననున్నారు.


కాగా, చారిత్రాత్మక గూగుల్ ఏఐ హబ్‌కు రేపు(మంగళవారం) ఢిల్లీలో అవగాహన ఒప్పందం జరుగనుంది. చంద్రబాబు బ్రాండింగ్, లోకేష్ కృషితో అతిపెద్ద పెట్టుబడి ఏపీకి రానుంది. గూగుల్ రాకతో ఏఐ సిటీగా రూపాంతరం చెందనుంది విశాఖపట్నం. మంత్రి లోకేష్ అమెరికా పర్యటనలోనే సంస్థ ప్రతినిధులతో తొలి చర్చలు జరిగిన విషయం తెలిసిందే. ఈ డీల్ తో ఏపీకి భారీ ఆదాయంతోపాటు యువతకు 1.88 లక్షల ఉద్యోగ అవకాశాలని కూటమి ప్రభుత్వం కల్పించనుంది.


ఈ వార్తలు కూడా చదవండి...

నాపై కుట్రలు చేశారు... వినుత కోట ఎమోషనల్

ఏపీ పర్యాటక రంగానికి జాతీయ గుర్తింపు దిశగా అడుగులు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 13 , 2025 | 06:38 PM