AP Police On Perni Nani: ఏపీ పోలీసుల యాక్షన్.. దిగొచ్చిన పేర్ని నాని
ABN , Publish Date - Oct 13 , 2025 | 04:27 PM
మచిలీపట్నం పోలీసులు యాక్షన్ చేపట్టడంతో మాజీ మంత్రి పేర్ని నాని దిగొచ్చారు. ఈ క్రమంలో పేర్ని నానితో సహా మచిలీపట్నం పోలీస్ స్టేషన్‌కి క్యూ కట్టారు వైసీపీ నేతలు.
మచిలీపట్నం, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): మచిలీపట్నం పోలీసులు (Machilipatnam Police) యాక్షన్ చేపట్టడంతో మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) దిగొచ్చారు. ఈ క్రమంలో పేర్ని నానితో సహా మచిలీపట్నం పోలీస్ స్టేషన్‌కి క్యూ కట్టారు వైసీపీ నేతలు (YSRCP Leaders). ఇటీవల మచిలీపట్నం ప్రభుత్వ మెడికల్ కాలేజ్ వద్ద అనుమతులు లేకుండా ధర్నా చేశారు వైసీపీ నేతలు.
ఈ క్రమంలో పోలీసుల అనుమతి లేకుండా ఆందోళన చేయడంతో 400 మంది వైసీపీ నేతలపై కేసు నమోదు చేశారు. సుమారు 100 మందికి 41ఏ నోటీసులు జారీ చేశారు. నోటీసులకు సమాధానం ఇవ్వకుండా మొన్నటి వరకు పోలీసులతో దోబూచులాడారు ఫ్యాన్ పార్టీ నేతలు. రెండు రోజుల క్రితం వైసీపీ నగర అధ్యక్షుడు మేకల సుబ్బన్న అరెస్ట్‌తో వైసీపీ నేతలు అలర్ట్ అయ్యారు. పేర్ని నానితో సహా పోలీస్ స్టేషన్‌కి వచ్చి నోటీసులకు రిప్లై ఇచ్చారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతల నుంచి స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు ఎస్ఐ ప్రభాకరరావు.
ఈ వార్తలు కూడా చదవండి...
నాపై కుట్రలు చేశారు... వినుత కోట ఎమోషనల్
ఏపీ పర్యాటక రంగానికి జాతీయ గుర్తింపు దిశగా అడుగులు
Read Latest AP News And Telugu News