Share News

AP Police Arrest On Chaitanya Babu: మొలకల చెరువు నకిలీ మద్యం కేసు.. చైతన్య బాబు అరెస్టు

ABN , Publish Date - Oct 13 , 2025 | 05:11 PM

మొలకల చెరువు నకిలీ మద్యం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ(22) నిందితుడిగా ఉన్న చైతన్య బాబుని అరెస్టు చేసి రిమాండ్‌కి తరలించారు ఎక్సైజ్ పోలీసులు.

AP Police Arrest On Chaitanya Babu: మొలకల చెరువు నకిలీ మద్యం కేసు.. చైతన్య బాబు అరెస్టు
AP Police Arrest On Chaitanya Babu

చిత్తూరు, అన్నమయ్య జిల్లా, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): మొలకల చెరువు నకిలీ మద్యం కేసు (Fake Liquor Case)లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ(22) నిందితుడు చైతన్య బాబు (Chaitanya Babu)ని అరెస్టు చేసి రిమాండ్‌కి తరలించారు ఎక్సైజ్ పోలీసులు. అయితే, నకిలీ మద్యం కేసులో ఇప్పటివరకు అరెస్టు అయిన వారి సంఖ్య 15కి చేరింది.


ఇంకా ఈ కేసులో ఎనిమిది మందిని అరెస్టు చేయాల్సి ఉంది. మరి కొంతమందిపై కేసు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఏపీ ప్రభుత్వం (AP Govt) ఈ కేసుని సిట్‌ (SIT)కి అప్పగించడంతో నకిలీ మద్యం తయారీతో సంబంధం ఉన్న వ్యక్తుల్లో టెన్షన్ పెరిగింది. ఆరోపణలు ఎదుర్కొంటూ ఏ (17) నిందితునిగా కేసు నమోదైన తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన తంబళ్లపల్లె నియోజకవర్గం ఇన్‌చార్జ్ దాసరపల్లి జయచంద్రారెడ్డి, ఆయన బామ్మర్థి గిరిధర్ రెడ్డిని అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి...

నాపై కుట్రలు చేశారు... వినుత కోట ఎమోషనల్

ఏపీ పర్యాటక రంగానికి జాతీయ గుర్తింపు దిశగా అడుగులు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 13 , 2025 | 06:09 PM