CM Chandrababu On Delhi: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ఎందుకంటే..
ABN , Publish Date - Oct 13 , 2025 | 04:06 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేశ రాజధాని ఢిల్లీకి సోమవారం బయలుదేరి వెళ్లారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఇవాళ సాయంత్రం 4:45గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు.
అమరావతి, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu), మంత్రి లోకేశ్ దేశ రాజధాని ఢిల్లీ (Delhi)కి ఇవాళ(సోమవారం) బయలుదేరి వెళ్లారు. కాసేపటి క్రితమే సీఎం ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఇవాళ సాయంత్రం 4:45 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi)తో భేటీ కానున్నారు.
కర్నూలులో తలపెట్టిన సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్ కార్యక్రమానికి ప్రధాని మోదీని ఆహ్వానించనున్నారు. అలాగే, నవంబర్ 14, 15వ తేదీల్లో విశాఖపట్నంలో జరుగనున్న సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్‌కు మోదీని ఆహ్వానించనున్నారు. రేపు(మంగళవారం) గూగుల్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకునే కార్యక్రమంలో పాల్గొననున్నారు సీఎం చంద్రబాబు.
ఈ వార్తలు కూడా చదవండి...
నాపై కుట్రలు చేశారు... వినుత కోట ఎమోషనల్
ఏపీ పర్యాటక రంగానికి జాతీయ గుర్తింపు దిశగా అడుగులు
Read Latest AP News And Telugu News