Share News

AP Police Notices to Sakshi Media: సాక్షికి ఏపీ పోలీసుల నోటీసులు.. ఎందుకంటే..

ABN , Publish Date - Oct 13 , 2025 | 03:15 PM

అసత్య ప్రచారం చేస్తున్న సాక్షి మీడియాకి నోటీసులు పంపించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. కల్తీ మద్యంతో మరణాలు అంటూ అసత్య వార్తలు వండి వార్చిన జగన్ మీడియా సంస్థ సాక్షి.

AP Police Notices to Sakshi Media: సాక్షికి ఏపీ పోలీసుల నోటీసులు.. ఎందుకంటే..
AP Police Notices to Sakshi Media

అమరావతి, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): అసత్య ప్రచారం చేస్తున్న సాక్షి మీడియా (Sakshi Media)కి నోటీసులు పంపించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం (Andhra Pradesh Government). కల్తీ మద్యంతో మరణాలు అంటూ అసత్య వార్తలని వండి వార్చింది జగన్ (Jagan) మీడియా సంస్థ సాక్షి. ఈ మేరకు ఆధారాలు చూపాలంటూ సెక్షన్ 179 (1) ప్రకారం నోటీసులు జారీ చేశారు ఏపీ పోలీసులు (AP Police).


సాక్షి యాజమాన్యంతో పాటు సాక్షి పత్రిక చీఫ్ ఎడిటర్ ధనుంజయ రెడ్డి, సాక్షి నెల్లూరు జిల్లా బ్యూరో చీఫ్ చిలకా మస్తాన్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. నకిలీ మద్యానికి నలుగురు బలి అంటూ సాక్షి పత్రికలో 8.10.2025న ప్రచురించిన వార్తకు సంబంధించిన ఆధారాలు తమకు 12.10.2025న కలిగిరి పోలీస్ స్టేషన్‌కి వచ్చి సమర్పించాలని సాక్షి యాజమాన్యానికి నోటీసుల్లో స్పష్టం చేశారు పోలీసులు.


ఆధారాలు చూపించకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని సాక్షికి నోటీసులు జారీ చేశారు పోలీసులు. ఈ నేపథ్యంలో నోటీసులు తీసుకోవడానికి ముందుకు రాలేదు సాక్షి యాజమాన్యం. ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి నోటీసులు తీసుకోకుండా పరార్ అయ్యినట్లు తెలుస్తోంది. రాసిన తప్పుడు వార్తలకు సంబంధించి వివరణ ఇవ్వకపోతే ఎక్కడున్నా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ పోలీసులు హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

నాపై కుట్రలు చేశారు... వినుత కోట ఎమోషనల్

ఏపీ పర్యాటక రంగానికి జాతీయ గుర్తింపు దిశగా అడుగులు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 13 , 2025 | 04:08 PM