Share News

AP Government on Revenue Sources: ఆదాయ వనరుల సమీకరణపై ఏపీ ప్రభుత్వం కసరత్తు

ABN , Publish Date - Oct 13 , 2025 | 05:37 PM

ఆదాయ వనరుల సమీకరణపై ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆదాయ వనరుల సమీకరణ కోసం ప్రత్యామ్నాయ మార్గాలని గుర్తించేందుకు మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది.

AP Government on Revenue Sources: ఆదాయ వనరుల సమీకరణపై ఏపీ ప్రభుత్వం కసరత్తు
AP Government on Revenue Sources

అమరావతి, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): ఆదాయ వనరుల సమీకరణపై ఏపీ ప్రభుత్వం (AP Government) కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఆదాయ వనరుల సమీకరణ కోసం ప్రత్యామ్నాయ మార్గాలని గుర్తించేందుకు మంత్రి వర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఆరుగురు మంత్రులతో మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కేబినెట్ సబ్ కమిటీలో సభ్యుడిగా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ (Minister Payyavula Keshav) ఉన్నారు.


జీవోఎం సభ్యులుగా మంత్రులు కొల్లు రవీంద్ర, అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్ యాదవ్, కందుల దుర్గేశ్, వంగలపూడి అనితని కూటమి ప్రభుత్వం నియమించింది. ఈ క్రమంలో ఆదాయ వృద్ధికి ప్రత్యామ్నాయ చర్యల గుర్తింపు, అమలుపై చర్చించాలని ఆదేశాలు జారీ చేసింది. నెలవారీ ఆదాయాలను, లక్ష్యాలతో పోల్చి సమీక్షించాలని ఆజ్ఞాపించింది.


ఆదాయ పనితీరును మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన సంస్కరణలపై సిఫార్సు చేయాలని దిశానిర్దేశం చేసింది. ఏపీ ఆదాయం పెంచేందుకు తీసుకోవాల్సిన మార్పులు, సాంకేతికత అమలుపై సిఫార్సులు చేయాలని మార్గనిర్దేశం చేసింది. ఆదాయ వనరుల పెంపు కోసం పరిపాలనా పరంగా బలోపేతం చేయడంపై చర్చించాలని సూచించింది. ఆదాయ వనరుల పెంపుకోసం చట్టాలు, నియమాలు, విధానాలకు సవరణల అవసరాన్ని సమీక్షించాలని ఆదేశాలు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.


పలు ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం, బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించాలని ఆదేశించింది. పలు ప్రభుత్వ విభాగాల్లో విధానపరమైన అడ్డంకులని పరిష్కరించాలని సూచించింది. స్వర్ణాంధ్ర- 2047 దార్శనికతకు అనుగుణంగా మధ్యస్థ, దీర్ఘకాలిక ఆదాయ వ్యూహాలపై దిశానిర్దేశం చేయాలని ఆదేశించింది.


పనితీరుపై సమీక్ష, కొత్త చర్యలపై చర్చ, అడ్డంకుల పరిష్కారం కోసం ప్రతినెలా సమావేశం కావాలని ఆదేశించింది. మంత్రుల బృందం ఎప్పటికప్పుడూ ప్రభుత్వానికి సలహాలు, నివేదికలు, సిఫార్సులు చేయాలని ఆజ్ఞాపించింది. ఈ మేరకు తదుపరి చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖకు ఏపీ సీఎస్ కె.విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

నాపై కుట్రలు చేశారు... వినుత కోట ఎమోషనల్

ఏపీ పర్యాటక రంగానికి జాతీయ గుర్తింపు దిశగా అడుగులు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 13 , 2025 | 06:08 PM