Share News

నాకు మంత్రి పదవి పోవడంపై బాధగా లేదు.. కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Sep 29 , 2026 | 12:57 PM

తనకు మంత్రి పదవి పోవడం బాధగా లేదని ఎమ్మెల్యే కొండా సురేఖ వ్యాఖ్యానించారు. మంత్రిగా ఉంటే రాష్ట్రస్థాయిలో సేవచేసే అవకాశం తనకు ఉండేదని పేర్కొన్నారు.

నాకు మంత్రి పదవి పోవడంపై బాధగా లేదు.. కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు
Konda Surekha

వరంగల్ జిల్లా, సెప్టెంబర్ 29 (ఆంధ్రజ్యోతి): తనకు మంత్రి పదవి పోవడం బాధగా లేదని ఎమ్మెల్యే కొండా సురేఖ (Konda Surekha) వ్యాఖ్యానించారు. మంత్రిగా ఉంటే రాష్ట్రస్థాయిలో సేవచేసే అవకాశం తనకు ఉండేదని పేర్కొన్నారు. ఈరోజు(మంగళవారం) వరంగల్ జిల్లాలోని తన క్యాంపు కార్యాలయంలో CMRF చెక్కులను కొండా సురేఖ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.


మా అనుచరులపై ఈగవాలిన ఊరుకోం..

ఇప్పుడు వరంగల్ నియోజకవర్గంపై దృష్టి సారించి అభివృద్ధి చేసే అవకాశం తనకు వచ్చిందని కొండా సురేఖ వెల్లడించారు. ఇకపై నియోజకవర్గంలో అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పుకొచ్చారు. వచ్చే వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలను గెలవడమే తమ లక్ష్యమని వ్యాఖ్యానించారు. తమ అనుచరులపై ఈగవాలిన ఊరుకోబోమని హెచ్చరించారు. మొన్న ఎంజీఎం దగ్గర బీఆర్ఎస్ నేతలు అత్యుత్సాహం ప్రదర్శించారని ధ్వజమెత్తారు.


వరంగల్ అభివృద్ధిపై బీజేపీకి సవాల్..

వాళ్లు వాళ్లే తోసేసుకుని పోలీసులు కొట్టారని ఆస్పత్రిలో జాయిన్ అయ్యారని కొండా సురేఖ విమర్శించారు. కొత్త కలెక్టరేట్ దగ్గర బీజేపీ నాయకులు నిరసన తెలిపి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహించారు. వరంగల్ అభివృద్ధిపై బీజేపీ నాయకులకు సవాల్ చేశారు. వరంగల్‌లో పురాతన ప్రదేశాలను అభివృద్ధి చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకువచ్చి.. అప్పుడు మాట్లాడాలని కొండా సురేఖ ఛాలెంజ్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఖైరతాబాద్ ఉప ఎన్నికలో దిమ్మ తిరిగే రిజల్ట్స్ వస్తాయి: దానం నాగేందర్

భాగ్యనగరంలో మైకుల మోతపై నటుడు అల్లు శిరీశ్ ఫిర్యాదు

ఎంపీల అనర్హత పిటిషన్ల ఆలస్యంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 29 , 2026 | 01:50 PM