Share News

రేవంత్ సర్కార్‌లో అన్నదమ్ములు తెలంగాణను దోచుకుంటున్నారు: రఘునందన్ రావు

ABN , Publish Date - Sep 02 , 2026 | 08:20 PM

నర్సాపూర్‌లో 22A నిషేధిత భూముల జాబితాని వ్యతిరేకిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో బుధవారం మహా ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో బీజేపీ ఎంపీలు రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఈటల రాజేందర్ పాల్గొన్నారు.

 రేవంత్ సర్కార్‌లో అన్నదమ్ములు తెలంగాణను దోచుకుంటున్నారు: రఘునందన్ రావు
Raghunandan Rao

మెదక్, సెప్టెంబర్ 2 (ఆంధ్రజ్యోతి): నర్సాపూర్‌లో 22A నిషేధిత భూముల జాబితాని వ్యతిరేకిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ఈరోజు (బుధవారం) మహా ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో బీజేపీ ఎంపీలు రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఈటల రాజేందర్ పాల్గొన్నారు.


ధరణి, భూ భారతిలతో దోచుకోవడం తప్ప ప్రయోజనం లేదు: ఎంపీ రఘునందన్ రావు

తెలంగాణను కేసీఆర్ హయాంలో తండ్రి, కొడుకు, కూతురు, మేనల్లుడు దోచుకుంటే.. రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలో అన్నదమ్ములు దోచుకుంటున్నారని ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. అధికారంలోని కాంగ్రెస్, ప్రతిపక్షంలోని బీఆర్ఎస్ పార్టీలు దొంగ పోలీస్ ఆట ఆడుతున్నాయని విమర్శించారు. వేల కోట్లు దోచుకున్న బీఆర్ఎస్ నాయకులలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కరినైనా అరెస్ట్ చేసిందా అని ప్రశ్నించారు. ధరణి, భూ భారతిలతో దోచుకోవడం తప్ప ప్రయోజనం ఏమి లేదని ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు.


రేవంత్‌రెడ్డి పేదల భూములు కొల్లగొట్టడంలో రీసెర్చ్ స్కాలర్ చేస్తున్నారు: ఎంపీ ఈటల

eetala.jpg

తెలంగాణను కేసీఆర్ ఇంట్లో దోచుకుంది నలుగురే కానీ రేవంత్ రెడ్డి ఇంట్లో ఏడుగురు ఉన్నారని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు. గతంలో కేసీఆర్‌ను గద్దె దించడానికి ఎక్కువ సమయం పట్టలేదని.. ఇప్పుడు రేవంత్‌కి కూడా అదే గతి పట్టకుండా చూసుకోవాలని హితవు పలికారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి రేవంత్‌రెడ్డి పేదల భూములు కొల్లగొట్టడంలో రీసెర్చ్ స్కాలర్ చేస్తున్నారని ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు.


ధరణి కంటే అధ్వాన్నంగా భూ భారతి తయారైంది: ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

konda-vishweshwar-reddy.jpg

22A నిషేధిత భూముల జాబితాలో తప్పు చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. ధరణి కంటే అధ్వాన్నంగా భూ భారతి తయారైందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులతో కుమ్మకై లక్షల ఎకరాలు కాజేస్తుందని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హైదరాబాద్‌ను గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం: సీఎం రేవంత్‌రెడ్డి

రాహుల్ గాంధీపై ఆ కేసు నమోదు.. కేంద్రంపై మంత్రి జూపల్లి ధ్వజం

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హై కోర్టులో ఊరట

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 02 , 2026 | 08:26 PM