Share News

హైదరాబాద్‌ను గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం: సీఎం రేవంత్‌రెడ్డి

ABN , Publish Date - Sep 01 , 2026 | 03:03 PM

హైదరాబాద్‌ను గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వం లక్ష్యమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర యువతకు ప్రపంచస్థాయి విద్య అందుబాటులోకి రానుందని పేర్కొన్నారు.

హైదరాబాద్‌ను గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం: సీఎం రేవంత్‌రెడ్డి
Telangana CM Revanth Reddy

హైదరాబాద్, సెప్టెంబర్ 1 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ను గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వం లక్ష్యమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) వ్యాఖ్యానించారు. రాష్ట్ర యువతకు ప్రపంచస్థాయి విద్య అందుబాటులోకి రానుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్(X) వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి పోస్టు పెట్టారు. హార్వర్డ్ యూనివర్సిటీ కూడా తెలంగాణలో కోర్సులు, ప్రోగ్రామ్‌లకు ఆసక్తి చూపిస్తోందని తెలిపారు.


హైదరాబాద్‌లో ఆఫ్‌షోర్ క్యాంపస్‌లను యూనివర్సిటీ ఆఫ్ లండన్, నార్త్‌ఈస్టర్న్ యూనివర్సిటీ ఏర్పాటు చేయనుందని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. హార్వర్డ్ యూనివర్సిటీ కూడా తెలంగాణలో కోర్సులు, ప్రోగ్రామ్‌లను ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపిస్తోందని చెప్పుకొచ్చారు. ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్, ఇంపీరియల్ కాలేజ్‌తో చర్చలు సానుకూలంగా జరిగాయని వివరించారు. LBS, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌తోనూ సానుకూల ఫలితాలు వచ్చాయని తెలిపారు.


MIT, అమెరికాలోని ఇతర ప్రముఖ విశ్వవిద్యాలయాలతోనూ చర్చలు ఫలప్రదమయ్యాయని ముఖ్యమంత్రి వెల్లడించారు. సంయుక్త పరిశోధనలు, సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు ఓ ప్రణాళిక రచిస్తున్నామని అన్నారు. ప్రొఫెషనల్స్ కోసం ప్రత్యేక కోర్సులు, సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రపంచ విద్యా శక్తికేంద్రంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణలో తొలిసారిగా కవచ్ ప్రాజెక్ట్‌ను అమలు చేస్తున్నాం: కిషన్‌రెడ్డి

ఇందిరమ్మ ఇళ్లు ఉన్న గ్రామాల్లోనే మేము ఓట్లు అడుగుతాం: మంత్రి పొంగులేటి

‘తెలంగాణ - జర్మనీ’ లాజిస్టిక్ కారిడార్ ఏర్పాటుకు సహకరించండి: మంత్రి శ్రీధర్‌బాబు

Read Latest Telangana News And AP NewsAnd National News

And Telugu News

Updated Date - Sep 01 , 2026 | 03:31 PM