‘తెలంగాణ - జర్మనీ’ లాజిస్టిక్ కారిడార్ ఏర్పాటుకు సహకరించండి: మంత్రి శ్రీధర్‌బాబు
ABN , Publish Date - Aug 31 , 2026 | 08:27 PM
తెలంగాణ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో జర్మన్‌కు చెందిన జీఐబీఏ ప్రతినిధులు సోమవారం సచివాలయంలో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రి చర్చించారు.
హైదరాబాద్, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో (Telangana Minister Sridhar Babu) జర్మన్‌కు చెందిన జీఐబీఏ ప్రతినిధులు ఈరోజు (సోమవారం) సచివాలయంలో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రి చర్చించారు. సెమీ కండక్టర్ రంగంలో తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని సూచించారు. జర్మనీ కంపెనీలను ప్రోత్సహించాలని జీఐబీఏ ప్రతినిధులను మంత్రి కోరారు. తెలంగాణను సెమీ కండక్టర్ మ్యాన్‌ఫ్యాక్చరింగ్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని వెల్లడించారు.
సెమీ కండక్టర్స్, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో పెట్టుబడులకు అవకాశాలు కల్పిస్తున్నామని మంత్రి చెప్పుకొచ్చారు. ‘తెలంగాణ–జర్మనీ’ లాజిస్టిక్ కారిడార్ ఏర్పాటుకు సహకరించాలని కోరారు. జర్మనీ, యూరప్ మార్కెట్లకు తెలంగాణ ఎగుమతులు సులభంగా చేరేలా ప్రత్యేక కారిడార్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
వేగవంతమైన అనుమతులు, మౌలిక వసతులు, పెట్టుబడి ప్రోత్సాహకాలు అందిస్తామని మంత్రి చెప్పారు. జర్మనీ టెక్నాలజీని తెలంగాణ టాలెంట్‌తో అనుసంధానిస్తామని వెల్లడించారు. ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2026’పై జర్మనీ పారిశ్రామికవేత్తలకు అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేశారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2026 నిర్వహిస్తున్నామని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
‘టాక్సిక్’లో అసభ్యత తప్ప సమాజానికి ఉపయోగపడే సందేశం లేదు: రాజాసింగ్
వికారాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, మరో ఇద్దరి పరిస్థితి విషమం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News