వికారాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, మరో ఇద్దరి పరిస్థితి విషమం
ABN , Publish Date - Aug 30 , 2026 | 09:40 PM
వికారాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. పరిగి మండలం గడిసింగపూర్ సమీపంలోని చింతల చెరువు వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టింది.
వికారాబాద్, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): వికారాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. పరిగి మండలం గడిసింగపూర్ సమీపంలోని చింతల చెరువు వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో ఇద్దరు మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో ఖాజా బీ (65), జహంగీర్ బీ (78) మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం వికారాబాద్ ఆస్పత్రికి తరలించారు. సమచారం అందగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దోమ మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన నలుగురు కారులో ప్రయాణిస్తున్నారు. అబ్దుల్ హై అనే వ్యక్తి తన కారులో మరో ముగ్గురికి లిఫ్ట్ ఇచ్చాడు. నలుగురు కలిసి ప్రయాణిస్తుండగా పరిగి మండలం గడిసింగపూర్ సమీపంలోని చింతల చెరువు వద్ద ప్రమాదం జరిగింది. చింతల చెరువు సమీపంలో రోడ్డుపై ఆగి ఉన్న లారీని కారు వెనుక నుంచి వేగంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
సంజీవని గేమ్ చేంజర్‌గా మారుతుంది: సీఎం చంద్రబాబు
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన
ఉద్యోగాల పేరుతో మోసం.. భద్రాచలం ఎమ్మెల్యే పీఏపై చీటింగ్ కేసు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News