తెలంగాణలో తొలిసారిగా కవచ్ ప్రాజెక్ట్‌ను అమలు చేస్తున్నాం: కిషన్‌రెడ్డి
ABN , Publish Date - Aug 31 , 2026 | 06:22 PM
తెలంగాణ రాష్ట్రంలోని రైల్వేల అభివృద్ధికి అంకితభావంతో తాము పనిచేస్తున్నామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కొత్త రైల్వే ట్రాక్‌లు, వాటిని ఉన్నతీకరణ చేసే విధంగా పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు.
మహబూబ్‌నగర్, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రంలోని రైల్వేల అభివృద్ధికి అంకితభావంతో తాము పనిచేస్తున్నామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) వ్యాఖ్యానించారు. కొత్త రైల్వే ట్రాక్‌లు, వాటిని ఉన్నతీకరణ చేసే విధంగా పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ఆధునికీకరణ పనులు కొనసాగుతున్న రైల్వేస్టేషన్ పనులను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ డీకే అరుణ ఈరోజు (సోమవారం) పరిశీలించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడారు. మహబూబ్‌నగర్‌ను రైల్వేహాబ్‌గా మారుస్తున్నామని వెల్లడించారు. 5 వందేభారత్ రైళ్లను కేంద్రప్రభుత్వం తెలంగాణకు ఇచ్చిందని ప్రస్తావించారు. మోదీ హయాంలోని పదేళ్లలో 100 కొత్త రైళ్లను తెలంగాణలో అందుబాటులోకి తీసుకువచ్చామని వెల్లడించారు.
తెలంగాణలో 42 రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేస్తున్నాం..
తెలంగాణలో 42 రైల్వేస్టేషన్లను ఏకకాలంలో అభివృద్ధి చేస్తున్నామని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. మౌలిక వసతులకు పెద్దపీట వేస్తున్నామని చెప్పుకొచ్చారు. 2014కు ముందు రైల్వేస్టేషన్లు అధ్వానంగా ఉండేవని.. కానీ నేడు మోదీ హయాంలో పరిస్థితి మారిందని తెలిపారు. ప్రయాణికులు భాగస్వాములైతే స్వచ్ఛస్టేషన్లు సాధ్యమవుతాయని వివరించారు. రైల్వేస్టేషన్లు ఏయిర్‌పోర్టు స్థాయిలో ఉండాలన్నదే ప్రధానమంత్రి నరేంద్రమోదీ లక్ష్యమని ఉద్ఘాటించారు.
తెలంగాణకు మూడు బుల్లెట్ ట్రైన్లు..
2014కు ముందు ఉమ్మడి రాష్ట్రంలో రూ.886 కోట్ల రైల్వేబడ్జెట్ ఉంటే 2026-27 బడ్జెట్‌లో తెలంగాణకే రూ.5454 కోట్లను కేంద్రం కేటాయించిందని కిషన్‌రెడ్డి తెలిపారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి తెలంగాణలో రైల్వే రంగం నిర్లక్ష్యానికి గురైందని అన్నారు. దేశంలో 7 బుల్లెట్ ట్రైన్స్ ప్రవేశపెడితే.. తెలంగాణకు మూడు ఇచ్చామని.. ఇది రైల్వేరంగంలో సువర్ణాధ్యాయమని నొక్కిచెప్పారు. రూ.5 లక్షల కోట్లతో బుల్లెట్ ట్రైన్స్ అందుబాటులోకి తీసుకువస్తున్నామని స్పష్టం చేశారు. ప్రమాదాలు జరగకుండా దేశంలోనే తొలిసారిగా కవచ్ ప్రాజెక్ట్‌ను తెలంగాణలో ప్రయోగాత్మకంగా అమలు చేయబోతున్నామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
‘టాక్సిక్’లో అసభ్యత తప్ప సమాజానికి ఉపయోగపడే సందేశం లేదు: రాజాసింగ్
వికారాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, మరో ఇద్దరి పరిస్థితి విషమం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News