Share News

రాహుల్ గాంధీపై ఆ కేసు నమోదు.. కేంద్రంపై మంత్రి జూపల్లి ధ్వజం

ABN , Publish Date - Sep 01 , 2026 | 06:57 PM

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయించడం కేంద్ర ప్రభుత్వ దుశ్చర్య అని తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మత రాజకీయాలకు తెర లేపారని ధ్వజమెత్తారు.

రాహుల్ గాంధీపై ఆ కేసు నమోదు.. కేంద్రంపై మంత్రి జూపల్లి ధ్వజం
Telangana Minister Jupally Krishna Rao

నాగర్ కర్నూల్ జిల్లా, సెప్టెంబర్ 1 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయించడం కేంద్ర ప్రభుత్వ దుశ్చర్య అని తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు (Telangana Minister Jupally Krishna Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మత రాజకీయాలకు తెర లేపారని ధ్వజమెత్తారు. ప్రధానమంత్రి అవకాశాలు వచ్చిన సోనియాగాంధీ కుటుంబం తీసుకోలేదని చెప్పుకొచ్చారు. రాహుల్ గాంధీపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టినందుకు.. నిరసనగా ఈరోజు (మంగళవారం) నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం అంబేడ్కర్ చౌరస్తా వద్ద గంటసేపు రోడ్డుపై బైఠాయించి మంత్రి జూపల్లి కృష్ణారావు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడారు.


రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర నిర్వహించి దేశ ప్రజలను చైతన్యం చేశారని మంత్రి జూపల్లి ప్రస్తావించారు. అలాంటి కుటుంబంపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేయడం దుశ్చర్యగా భావిస్తున్నామని అన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. ఉత్తరప్రదేశ్‌లోని అల్ది హల్ద్వానిలోని ర్యాలీ వేదికను ఎక్కారని.. శుద్ధి చేసిన వారిపై కేసు నమోదు చేయకుండా.. ఆ విషయాన్ని ప్రశ్నించిన రాహుల్ గాంధీపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టడమేంటని ప్రశ్నించారు. ‘మోదీ హటావో దేశ్‌కి బచావో.. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’ అని మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ పాల్గొన్నారు


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణలో తొలిసారిగా కవచ్ ప్రాజెక్ట్‌ను అమలు చేస్తున్నాం: కిషన్‌రెడ్డి

ఇందిరమ్మ ఇళ్లు ఉన్న గ్రామాల్లోనే మేము ఓట్లు అడుగుతాం: మంత్రి పొంగులేటి

‘తెలంగాణ - జర్మనీ’ లాజిస్టిక్ కారిడార్ ఏర్పాటుకు సహకరించండి: మంత్రి శ్రీధర్‌బాబు

Read Latest Telangana News And AP NewsAnd National News

And Telugu News

Updated Date - Sep 01 , 2026 | 07:12 PM