Share News

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హై కోర్టులో ఊరట

ABN , Publish Date - Sep 01 , 2026 | 03:34 PM

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు తెలంగాణ హై కోర్టులో ఊరట లభించింది. శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్ కేసులో ఆయనపై సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆర్డర్‌ను డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది.

 హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హై కోర్టులో ఊరట
Telangana High Court

హైదరాబాద్, సెప్టెంబర్ 1 (ఆంధ్రజ్యోతి): హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు (HYDRA Commissioner Ranganath) తెలంగాణ హై కోర్టులో (Telangana High Court) ఊరట లభించింది. శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్ కేసులో ఆయనపై సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆర్డర్‌ను డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. తదుపరి విచారణ నవంబర్ 3వ తేదీకి న్యాయస్థానం వాయిదా వేసింది. అప్పటి వరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ని మార్చాలనే సింగిల్ బెంచ్ ఆర్డర్‌ను తాత్కాలికంగా డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది.


తదుపరి ఆదేశాల వరకు లోతుకుంటా భూముల జోలికి వెళ్లవద్దని హై కోర్టు స్పష్టం చేసింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ తరఫున హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు మాజీ సీజే జస్టిస్ రాజీవ్ శక్దర్ వాదనలు వినిపించారు. శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్ కేసుపై అప్పీ‌ల్‌కు హైడ్రా కమిషనర్ వెళ్లిన విషయం తెలిసిందే. ఇదే కేసులో రంగనాథ్‌ని తప్పించి మరో అధికారిని నియమించాలని సింగిల్ జడ్జి గతంలో తీర్పునిచ్చారు. ఈ క్రమంలోనే సింగిల్ జడ్జి తీర్పుని హైడ్రా కమిషనర్ రంగనాథ్ డివిజన్ బెంచ్‌లో సవాల్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణలో తొలిసారిగా కవచ్ ప్రాజెక్ట్‌ను అమలు చేస్తున్నాం: కిషన్‌రెడ్డి

ఇందిరమ్మ ఇళ్లు ఉన్న గ్రామాల్లోనే మేము ఓట్లు అడుగుతాం: మంత్రి పొంగులేటి

‘తెలంగాణ - జర్మనీ’ లాజిస్టిక్ కారిడార్ ఏర్పాటుకు సహకరించండి: మంత్రి శ్రీధర్‌బాబు

Read Latest Telangana News And AP NewsAnd National News

And Telugu News

Updated Date - Sep 01 , 2026 | 03:58 PM