Share News

మంత్రి తుమ్మల స్ఫూర్తితోనే సిద్దిపేటలో ఆయిల్ పామ్ సాగు: హరీశ్‌రావు

ABN , Publish Date - Mar 19 , 2026 | 08:25 PM

కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు రావడం వల్లనే నర్మెట్ట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ వచ్చిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. మాజీ సీఎం కేసీఆర్ రూ.300 కోట్లు మంజూరు చేసి ఈ ఫ్యాక్టరీ నిర్మాణానికి సహకరించారని ప్రస్తావించారు.

మంత్రి తుమ్మల స్ఫూర్తితోనే సిద్దిపేటలో ఆయిల్ పామ్ సాగు: హరీశ్‌రావు
Harish Rao

సిద్దిపేట జిల్లా, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు రావడం వల్లనే నర్మెట్ట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ వచ్చిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు (Harish Rao) వ్యాఖ్యానించారు. మాజీ సీఎం కేసీఆర్ రూ.300 కోట్లు మంజూరు చేసి ఈ ఫ్యాక్టరీ నిర్మాణానికి సహకరించారని ప్రస్తావించారు. ఈరోజు(శుక్రవారం) నంగునూర్ మండలం నర్మెట్ట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ వద్ద రైతు మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడారు. ఈ ప్రాంతంలో ఆయిల్ పామ్ సాగుకు స్ఫూర్తినిచ్చింది మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అని ప్రశంసించారు. తుమ్మల స్ఫూర్తితోనే సిద్దిపేటలో ఆయిల్ పామ్ సాగుకు నిర్ణయించామని చెప్పుకొచ్చారు.


అధునాతన సాంకేతితతో ఈ ఫ్యాక్టరీ నిర్మాణం..

ఫ్యాక్టరీ నిర్మాణానికి రూ.300 కోట్లతో అధునాతన సాంకేతితతో ఈ ఫ్యాక్టరీ నిర్మాణం జరిగిందని హరీశ్‌రావు తెలిపారు. అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్, మంత్రులు వస్తున్నప్పుడు కాళేశ్వరం జలాలు చూసి ఉంటారని అన్నారు. తుమ్మల నాగేశ్వరరావు రైతు శ్రేయోభిలాషి అని కొనియాడారు. ప్రభుత్వం మారినా ఫ్యాక్టరీ నిర్మాణాన్ని అడ్డుకోకుండా మంత్రి తుమ్మల కొనసాగించారని ప్రశంసించారు. రైతులకు రెండో‌లైన్ డ్రిప్ ఇప్పించాలని మంత్రిని కోరారు.


ఆయిల్ రేషియో ఎక్కువ..

ఇక్కడ ఆయిల్ రేషియో ఎక్కువ వస్తుందని, ఈ ప్రాంతం ఆయిల్ పామ్ సాగుకు అనుకూలంగా ఉందని హరీశ్‌రావు తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలతో ఏ మాత్రం నష్టం లేని పంట ఆయిల్ పామ్ సాగని వివరించారు. తమ హయాంలో 12 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు జరిగితే, కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో కేవలం 2 వేల ఎకరాలు మాత్రమే సాగయిందని వెల్లడించారు. రాష్ట్రంలో మొట్టమొదటి రిఫైనరీ ఇక్కడే వస్తుందని హరీశ్‌రావు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నిన్ను చంపేస్తాం.. రాజాసింగ్‌కు ఆగంతకుల బెదిరింపు..

హైదరాబాద్‌లో తమ్ముడి రాక్షసత్వం.. అక్కను హత్య చేసి.. ఆపై దారుణంగా..

యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కీలక మలుపు...

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - Mar 19 , 2026 | 08:47 PM