కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి గజ్వేల్ ప్రజల పక్షాన మాట్లాడాలి: రఘునందన్ రావు
ABN , Publish Date - Sep 06 , 2026 | 04:24 PM
సీఎం రేవంత్‌రెడ్డిపై బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటిదాకా ఈ దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా రాష్ట్ర ప్రజల భూములను 22 ఏలో పెట్టలేదని తెలిపారు.
సిద్దిపేట జిల్లా, సెప్టెంబర్ 6 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డిపై బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు (Medak MP Raghunandan Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటిదాకా ఈ దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా రాష్ట్ర ప్రజల భూములను 22 ఏలో పెట్టలేదని తెలిపారు. గజ్వేల్ పట్టణంలో ఎంపీ రఘునందన్ రావు ఈరోజు (ఆదివారం) పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పేద ప్రజల భూములను ఈ రోజు దాకా దేశంలో ఏ ప్రభుత్వం కూడా చివరకు ఇందిరా గాంధీ హయాంలో కూడా 22 ఏ లో పెట్టలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ సర్కార్ రాష్ట్రంలోని దళిత, గిరిజనుల, నోరు లేని అమాయకులను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆగ్రహించారు. దాదాపు లక్ష కోట్ల పేదల భూములను 22ఏలో పెట్టీ భారీ కుంభకోణానికి తెర లేపారని ఆరోపించారు.
లక్ష కోట్ల భూముల పంచాయితీలో పైసలు పంచుకుంటున్న మంత్రులు ఎవరో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెంటనే సమాధానం చెప్పాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. లేదా ఈ పైసలన్నీ తన ఖాతాలోనే వేసుకుంటానని అనుకుంటే సీఎం అయినా దీనికి సమాధానం చెప్పాలని పట్టుబట్టారు. 22 ఏ లో పేదల భూములను పెట్టొద్దని.. అవి తాతల కాలం నాటి నుంచి వస్తున్న ఆస్తులని తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ ఈసారి జరిగే శాసనసభ సమావేశాలకు హాజరు కావాలని కోరారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి గజ్వేల్ ప్రజల పక్షాన మాట్లాడితే వారికి గౌరవం ఉంటుందని రఘునందన్ రావు సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ అనే మొక్కను మొలవనివ్వను: సీఎం రేవంత్‌రెడ్డి
చేయూత సామాజిక భద్రతా పెన్షన్లకు కొత్త మార్గదర్శకాలు
గణేశ్ ఉత్సవాలపై సీపీ సజ్జనార్ కీలక ఆదేశాలు.. నెల రోజుల పాటు విజిబుల్ పోలీసింగ్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News