Share News

చేయూత సామాజిక భద్రతా పెన్షన్లకు కొత్త మార్గదర్శకాలు

ABN , Publish Date - Sep 05 , 2026 | 04:50 PM

చేయూత సామాజిక భద్రతా పెన్షన్లకు కొత్త మార్గదర్శకాలను తెలంగాణ సర్కార్ విడుదల చేసింది. కొత్త పెన్షన్ల మంజూరుకు ఫీల్డ్ వెరిఫికేషన్ తప్పనిసరి అని స్పష్టం చేసింది.

చేయూత సామాజిక భద్రతా పెన్షన్లకు కొత్త మార్గదర్శకాలు
Cheyutha Pension

హైదరాబాద్, సెప్టెంబర్ 5 (ఆంధ్రజ్యోతి): చేయూత సామాజిక భద్రతా పెన్షన్లకు కొత్త మార్గదర్శకాలను తెలంగాణ సర్కార్ విడుదల చేసింది. కొత్త పెన్షన్ల మంజూరుకు ఫీల్డ్ వెరిఫికేషన్ తప్పనిసరి అని స్పష్టం చేసింది. దశలవారీగా కొత్త పెన్షన్ల మంజూరుకు ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో అర్హుల ఎంపికకు క్షేత్రస్థాయిలో దరఖాస్తులను పరిశీలించనుంది. వెరిఫికేషన్ అధికారులుగా జిల్లా కలెక్టర్లను నియమించింది. గ్రామీణ ప్రాంతాల్లో మండల స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించింది.


మున్సిపల్ ప్రాంతాల్లోనూ ప్రత్యేక అధికారులతో వెరిఫికేషన్‌ను తెలంగాణ సర్కార్ చేయనుంది. గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సర్కిల్ స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించింది. చేయూత వెరిఫికేషన్ కోసం ప్రత్యేక మొబైల్ యాప్‌ను రూపొందించింది. ఈ మొబైల్ యాప్‌లోనే వెరిఫికేషన్ వివరాలు, అధికారుల రిమార్క్స్ నమోదు చేయనుంది. దరఖాస్తుదారుల నివాస ప్రాంతాల వారీగా డేటాను అధికారులకు అందజేయనుంది.


తెలంగాణ ప్రభుత్వం నిర్దేశించిన అర్హతలను కచ్చితంగా అధికారులు పరిశీలించాలని స్పష్టం చేసింది. దరఖాస్తుతో సమర్పించిన పత్రాలనూ అధికారులు తనిఖీ చేయాలని తెలిపింది. అవసరమైన పత్రం సమర్పించకపోతే.. వెరిఫికేషన్‌ను హోల్డ్‌లో పెట్టే అవకాశం ఉంటుందని పేర్కొంది. పత్రం సమర్పించిన తర్వాతే వెరిఫికేషన్ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అర్హత నిర్ధారణ తర్వాతే పెన్షన్ మంజూరుకు సిఫార్సు చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆ నిర్మాణాల నాణ్యత విషయంలో రాజీపడొద్దు: సీఎం రేవంత్‌‌రెడ్డి

సన్నబియ్యం అమ్మితే రేషన్ కార్డు తొలగిస్తాం: మంత్రి తుమ్మల

రైతుల జీవితాలతో రేవంత్ రెడ్డి ఆడుకుంటున్నారు.. హరీశ్‌రావు ధ్వజం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 05 , 2026 | 06:54 PM