Share News

సన్నబియ్యం అమ్మితే రేషన్ కార్డు తొలగిస్తాం: మంత్రి తుమ్మల

ABN , Publish Date - Sep 04 , 2026 | 06:42 PM

సన్నబియ్యం అమ్మితే రేషన్ కార్డు తొలగిస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.

 సన్నబియ్యం అమ్మితే రేషన్ కార్డు తొలగిస్తాం: మంత్రి తుమ్మల
Telangana Minister Tummala Nageswara Rao

ఖమ్మం జిల్లా, సెప్టెంబర్ 4, (ఆంధ్రజ్యోతి): సన్నబియ్యం అమ్మితే రేషన్ కార్డు తొలగిస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Telangana Minister Tummala Nageswara Rao) పేర్కొన్నారు. గుడిసెలో ఉండే ప్రతి ఒక్కరికీ ఇప్పుడే ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని.. ఇందుకు పార్టీతో పని లేదని.. పేదవారైతే అర్హుడే అని స్పష్టం చేశారు. ఇళ్లు లేని వారికి ఇళ్లు ఇవ్వకపోతే సర్పంచ్ పదవి పోతుందని చెప్పుకొచ్చారు. రఘునాథపాలెం మండలం పుటాని తండాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈరోజు (శుక్రవారం) శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, అటవీ శాఖ అధికారి అనూజ్ అగర్వాల్, భద్రాచలం ఐటీడీఏపీవో రాహుల్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడారు.


పోడు భూముల సమస్య పరిష్కరిస్తా..

పోడు భూముల సమస్య పరిష్కరిస్తానని మంత్రి తుమ్మల మాటిచ్చారు. కేవలం వ్యవసాయం మీదనే బతికే కుటుంబాలకు అండగా ఉంటానని భరోసా కల్పించారు. ఈ ఏడాది వర్షాలు పడే అవకాశం తక్కువగా ఉందని... వేసిన పంటలు పండే ఛాన్స్ లేదని తెలిపారు. తీవ్రమైన కరువు వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారని అన్నారు. నీళ్లు లేకపోయినా బతికే పంట ఫామ్ ఆయిల్ అని చెప్పారు. పామాయిల్ పంట వేస్తే అన్నీ ఉచితంగా ఇస్తామని స్పష్టం చేశారు. రఘునాథపాలెం మండలానికి ఈ రాత్రికి నీళ్లు వదులుతున్నామని, రేపు మోటార్లు ఆన్ చేసుకోవాలని అన్నారు. ఆర్‌వీఎఫ్‌ఆర్ పట్టా ఉన్న వారికి బోర్ అనుమతి ఇవ్వాల్సిందేనని తేల్చిచెప్పారు.


స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ పాఠశాల కూడా రాబోతుంది..

రూ.75 కోట్లతో 200 డొంక రోడ్లన్నీ వేయిస్తానని, దీంతో పాటు పొలాలకు వెళ్లేందుకు ఉన్న రోడ్లు కూడా వేయిస్తానని మంత్రి తుమ్మల తెలిపారు. పిల్లల చదువు కోసం స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ పాఠశాల కూడా రాబోతుందని వెల్లడించారు. పిల్లలకు చదువు లేకపోతే బతుకులు మారవని అభిప్రాయపడ్డారు. వందల కోట్లు పెట్టి పిల్లల కోసం ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటు చేస్తుంటే.. తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలకు పంపిస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆ విమానాశ్రయాల ప‌నులు వేగ‌వంతం చేయండి: సీఎం రేవంత్‌రెడ్డి

22A భూములపై అసెంబ్లీలో ఏం మాట్లాడతారో రండి.. బీఆర్ఎస్‌కి పొంగులేటి సవాల్

హైదరాబాద్ ట్రాఫిక్‌కు శాశ్వత పరిష్కారం దిశగా మరో కీలక అడుగు: మంత్రి పొన్నం ప్రభాకర్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 04 , 2026 | 07:06 PM