హైదరాబాద్ ట్రాఫిక్‌కు శాశ్వత పరిష్కారం దిశగా మరో కీలక అడుగు: మంత్రి పొన్నం ప్రభాకర్
ABN , Publish Date - Sep 02 , 2026 | 07:41 PM
హైదరాబాద్ ట్రాఫిక్‌కు శాశ్వత పరిష్కారం దిశగా మరో కీలక అడుగు పడిందని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. రూ.620 కోట్లతో నిర్మించిన కీలక కారిడార్ ప్రారంభానికి సిద్ధమైందని పేర్కొన్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 2 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ ట్రాఫిక్‌కు శాశ్వత పరిష్కారం దిశగా మరో కీలక అడుగు పడిందని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ (Telangana Minister Ponnam Prabhakar) వ్యాఖ్యానించారు. రూ.620 కోట్లతో నిర్మించిన కీలక కారిడార్ ప్రారంభానికి సిద్ధమైందని పేర్కొన్నారు. ఈరోజు (బుధవారం) హైదరాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రేపు నల్గొండ ‘ఎక్స్’ రోడ్స్–ఓవైసీ జంక్షన్ కారిడార్ ప్రారంభిస్తు్న్నట్లు వెల్లడించారు. సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా కారిడార్ ప్రారంభోత్సవం జరుగుతోందని చెప్పుకొచ్చారు.
నల్గొండ ‘ఎక్స్’ రోడ్స్–సైదాబాద్–ఐఎస్ సదన్–ఓవైసీ జంక్షన్ మధ్య ఈ కారిడార్ ఉందని మంత్రి పొన్నం తెలిపారు. 3.23 కిలోమీటర్ల పొడవున కాన్‌ఫ్లిక్ట్ ఫ్రీ కారిడార్ నిర్మాణం ఉంటుందని వివరించారు. 2.53 కిలోమీటర్ల ప్రధాన వయాడక్ట్.. 200 మీటర్ల అప్ ర్యాంప్ ఉంటుందని చెప్పారు. నల్గొండ ఎక్స్ రోడ్స్ నుంచి ఓవైసీ ఆస్పత్రి వరకు సిగ్నల్ ఫ్రీ ప్రయాణం కొనసాగుతుందని అన్నారు. ప్రయాణ సమయం సుమారు 30 నిమిషాల వరకు ఆదా అవుతుందని వెల్లడించారు.
చంచల్‌గూడ, సైదాబాద్, ఐఎస్ సదన్ ప్రాంతాల్లో ట్రాఫిక్ కష్టాలకు పరిష్కారమవుతాయని మంత్రి పొన్నం చెప్పారు. ఆయా వాహనాలు నిలిచిపోయే సమయం తగ్గడంతో ఇంధన వినియోగం తగ్గుతుందని వెల్లడించారు. వాయు కాలుష్యాన్ని తగ్గించడంలోనూ కారిడార్ కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. హైదరాబాద్‌ను ఆధునిక ట్రాఫిక్ వ్యవస్థ కలిగిన నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఉద్ఘాటించారు. ఫ్లైఓవర్లు, వంతెనలు, కాన్‌ఫ్లిక్ట్ ఫ్రీ కారిడార్లకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధిలో మరో మైలురాయిగా నూతన కారిడార్ ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హైదరాబాద్‌ను గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం: సీఎం రేవంత్‌రెడ్డి
రాహుల్ గాంధీపై ఆ కేసు నమోదు.. కేంద్రంపై మంత్రి జూపల్లి ధ్వజం
హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హై కోర్టులో ఊరట
Read Latest Telangana News And AP News And National News
And Telugu News