Share News

ఆ నిర్మాణాల నాణ్యత విషయంలో రాజీపడొద్దు: సీఎం రేవంత్‌‌రెడ్డి

ABN , Publish Date - Sep 04 , 2026 | 05:03 PM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి శుక్రవారం కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించి, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మద్దూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నిర్మాణంలోని సాంఘిక సంక్షేమ గురుకులం పనులను పరిశీలించారు.

ఆ నిర్మాణాల నాణ్యత విషయంలో రాజీపడొద్దు: సీఎం రేవంత్‌‌రెడ్డి
Telangana CM Revanth Reddy

కొడంగల్, సెప్టెంబర్ 4, (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి (Telangana CM Revanth Reddy) ఈరోజు (శుక్రవారం) కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించి, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మద్దూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నిర్మాణంలోని సాంఘిక సంక్షేమ గురుకులం పనులను పరిశీలించారు. అలాగే, దౌల్తాబాద్ మండలం గోకఫసల్వాడ్‌లో నిర్మాణంలో ఉన్న.. సాంఘిక సంక్షేమ గురుకులం పనులను పరిశీలించారు. దౌల్తాబాద్‌ ప్రభుత్వ జూనియర్ కాలేజ్‌ పనులను పరిశీలించనున్నారు.


నిర్మాణాల నాణ్యత విషయంలో రాజీపడొద్దని అన్నారు. నిర్ణీత గడువులోగా భవన నిర్మాణాలు పూర్తిచేయాలని ఆదేశించారు. హకీంపేట ఎడ్యుకేషన్ హబ్ పనులను పరిశీలించిన అనంతరం.. నియోజకవర్గ అభివృద్ధి పనులపై సమీక్షించనున్నారు. రోడ్డుమార్గాన కొడంగల్ చేరుకొని అక్కడే బస చేయనున్నారు. రేపు (శనివారం) కొడంగల్‌లో పలు అభివృద్ధి పనులపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష చేయనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆ విమానాశ్రయాల ప‌నులు వేగ‌వంతం చేయండి: సీఎం రేవంత్‌రెడ్డి

22A భూములపై అసెంబ్లీలో ఏం మాట్లాడతారో రండి.. బీఆర్ఎస్‌కి పొంగులేటి సవాల్

హైదరాబాద్ ట్రాఫిక్‌కు శాశ్వత పరిష్కారం దిశగా మరో కీలక అడుగు: మంత్రి పొన్నం ప్రభాకర్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 04 , 2026 | 05:12 PM