Share News

రైతుల జీవితాలతో రేవంత్ రెడ్డి ఆడుకుంటున్నారు.. హరీశ్‌రావు ధ్వజం

ABN , Publish Date - Sep 04 , 2026 | 02:52 PM

రైతుల జీవితాలతో సీఎం రేవంత్‌రెడ్డి ఆడుకుంటున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ధ్వజమెత్తారు.

రైతుల జీవితాలతో రేవంత్ రెడ్డి ఆడుకుంటున్నారు.. హరీశ్‌రావు ధ్వజం
Harish Rao

కొమురం భీం జిల్లా, సెప్టెంబర్ 4, (ఆంధ్రజ్యోతి): రైతుల జీవితాలతో సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఆడుకుంటున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు (Harish Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ధ్వజమెత్తారు. ఈరోజు (శుక్రవారం) కొమురం భీం జిల్లాలోని కౌటాల రైతు సదస్సులో మాజీ మంత్రి హరీశ్‌రావు పాల్గొని ప్రసంగించారు. సిర్పూర్ నియోజకవర్గంలో 42వేల ఎకరాలు నిషేధిత జాబితాలో ఉన్నాయని ప్రస్తావించారు. రేవంత్‌రెడ్డి పేదల ఉసురు పోసుకుంటున్నారని ఆగ్రహించారు. నాడు కేసీఆర్ భూములిస్తే... రేవంత్‌రెడ్డి ఆ భూములు లాక్కుంటున్నారని దుయ్యబట్టారు. నిషేధిత జాబితాలోని రైతన్నలకు ఎలాంటి పథకాలు వర్తించే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు.


ప్రజలే కేంద్ర బిందువుగా కేసీఆర్ పాలన..

‘ప్రజలే కేంద్ర బిందువుగా కేసీఆర్ పాలన చేశారని.. భూములే కేంద్ర బిందువుగా రేవంత్‌రెడ్డి పాలన కొనసాగుతోంది. లక్షలాది ఎకరాలు, ఇల్లు, ప్లాట్లను నిషేధిత జాబితాలో పెట్టి ఇబ్బంది పెడుతున్నారు. సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతుంటే... భూముల చుట్టూ రేవంత్‌రెడ్డి తిరుగుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు పట్టాలివ్వాలే కానీ ఉన్న భూములను కబ్జా పెడుతోంది. ఈ ప్రభుత్వమే ప్రజల భూములను కబ్జా పెట్టింది. రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌లో కూర్చొని కబ్జాదారులను అవమానిస్తున్నారు. ఒక్క ఎకరం కూడా నిషేధిత జాబితాలో పెట్టలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అంటున్నారు. రేవంత్‌రెడ్డి, పొంగులేటి చెబితే కలెక్టర్లు నిషేధిత భూముల జాబితా పంపించారని... అప్పుడెమో పొంగులేటి సారీ అని ఈజీగా చెబుతున్నారు. ప్రజల బాధను ఆయన చూసి మాట్లాడాలి’ అని హరీశ్‌రావు హితవు పలికారు.


ప్రజల నోటి కాడి బువ్వ లాక్కోవడమేనా ఇందిరమ్మ రాజ్యం..

‘15లక్షల ఎకరాల భూములను 22ఏ లో పెట్టి సారీ అని చెప్పి తప్పించుకోలేరు. ప్రజల నోటి కాడి బువ్వ లాక్కోవడమేనా ఇందిరమ్మ రాజ్యం. కలెక్టర్లు, అధికారులు, ప్రజలను ఇబ్బంది పెడితే.. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఎవరిని వదిలిపెట్టం. బేషరతుగా నిషేధిత జాబితాలోని భూములను పట్టా భూములుగా మార్చాలి. ప్రజలకు, రైతులకు న్యాయం జరిగే వరకు ఊరుకునేది లేదు. రాష్ట్రంలోని కాంట్రాక్టర్లు కూడా టెండర్ వేయట్లేదు. రేవంత్‌రెడ్డికి 15 శాతం కమీషన్ ఇవ్వాల్సి వస్తోందని కాంట్రాక్టర్లు టెండర్ వేయడం లేదు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క భార్య కూడా 15శాతం కమీషన్ అడుగుతుంది. అందుకే టెండర్ వేయడానికి ఒక్కరూ కూడా ముందుకు రావట్లేదు. వెయ్యి రోజుల పాలనలో ఏ ఒక్క పని కూడా సరిగ్గా చేయలేదు’ అని హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆ విమానాశ్రయాల ప‌నులు వేగ‌వంతం చేయండి: సీఎం రేవంత్‌రెడ్డి

22A భూములపై అసెంబ్లీలో ఏం మాట్లాడతారో రండి.. బీఆర్ఎస్‌కి పొంగులేటి సవాల్

హైదరాబాద్ ట్రాఫిక్‌కు శాశ్వత పరిష్కారం దిశగా మరో కీలక అడుగు: మంత్రి పొన్నం ప్రభాకర్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 04 , 2026 | 04:01 PM