Share News

‘సర్’ పై రాహుల్ గాంధీ అబద్ధాలు చెబుతున్నారు.. నితిన్ నబీన్ ధ్వజం

ABN , Publish Date - Nov 23 , 2026 | 03:27 PM

ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సర్’ అంశంలో ఆయన అబద్ధాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు.

 ‘సర్’ పై రాహుల్ గాంధీ అబద్ధాలు చెబుతున్నారు.. నితిన్ నబీన్  ధ్వజం
Nitin Nabin

కరీంనగర్, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీపై (Rahul Gandhi) బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ (Nitin Nabin) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సర్’ అంశంలో ఆయన అబద్ధాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారని మండిపడ్డారు. ఈరోజు (సోమవారం) కరీంనగర్‌లో నితిన్ నబీన్ పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో ఓటు చోరీ జరగలేదని స్పష్టం చేశారు. ప్రజలంతా బీజేపీ వైపే ఉన్నారని వ్యాఖ్యానించారు.


చనిపోయిన వారి ఓట్లను తొలగొంచొద్దా..?

3 కోట్ల మంది చనిపోయిన వారి ఓట్లను తొలగొంచొద్దా..? అని నితిన్ నబీన్ ప్రశ్నించారు. 13 కోట్ల ఓట్లు పోయాయని రాహుల్ గాంధీ అబద్ధాలు చెబుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం కోసం కాంగ్రెస్ పార్టీ ఏనాడు ఆలోచించలేదని విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో దేశం అభివృద్ధిలో పరుగులు పెడుతోందని ఉద్ఘాటించారు. ఢిల్లీలో రూపాయి విడుదల చేస్తే అది నేరుగా పేదల ఖాతాలోనే జమ అవుతుందని తెలిపారు. మోదీ నేతృత్వంలోనే బీజేపీ దేశంలో మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మోదీ ప్రధాని అయ్యాక దేశంలో అవినీతి తగ్గిందని నితిన్ నబీన్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

పార్టీకి నష్టం చేసేలా మాట్లాడితే చర్యలు.. సీఎం రేవంత్‌రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

హైదరాబాద్‌లో ఉగ్రదాడుల హెచ్చరిక.. పోలీసుల హై అలర్ట్!

తెలంగాణలో ష్నైడర్‌ సంస్థ విస్తరణకు పూర్తి సహకారం అందిస్తాం: భట్టి విక్రమార్క

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 23 , 2026 | 03:53 PM