Share News

తెలంగాణలో గ్యాస్‌ సిలిండర్ల కొరత లేదు: మంత్రి ఉత్తమ్

ABN , Publish Date - Mar 13 , 2026 | 01:10 PM

తెలంగాణ రాష్ట్రంలో గ్యాస్‌ సిలిండర్లకు కొరత లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. గృహ వినియోగదారులు ఆందోళనకు గురికాకుండా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు.

తెలంగాణలో గ్యాస్‌ సిలిండర్ల కొరత లేదు: మంత్రి ఉత్తమ్
Telangana Minister Uttam Kumar Reddy

హైదరాబాద్‌, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రంలో గ్యాస్‌ సిలిండర్లకు కొరత లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Telangana Minister Uttam Kumar Reddy) స్పష్టం చేశారు. గ్యాస్ గృహ వినియోగదారులు గందరగోళానికి గురికాకుండా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. గృహ వినియోగదారులకు సరిపడా గ్యాస్ సరఫరా చేస్తామని తెలిపారు. ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన పని లేదని పేర్కొన్నారు. గ్యాస్ కొరతపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈరోజు (శుక్రవారం) సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు.


ప్రధానంగా గ్యాస్ నిల్వలు, అంతర్జాతీయ పరిస్థితులపై మంత్రి ఉత్తమ్‌ సమీక్షించారు. ఈ సమావేశానికి సీఎస్‌, కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులు, గ్యాస్, ఆయిల్‌ కంపెనీలు, లీగల్ మెట్రలాజీ అధికారులు హాజరయ్యారు. ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. అధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించాలని మార్గనిర్దేశం చేశారు. గ్యాస్‌ని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని స్పష్టం చేశారు.


గ్యాస్ గృహ వినియోగదారులకు ఎక్కడ అసౌకర్యం కలిగించేలా చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. గ్యాస్‌ని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తే ఎక్కడికక్కడ చర్యలు చేపట్టాలని.. కలెక్టర్లకు, సీపీలకు, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు. ఆస్పత్రులకు, ప్రభుత్వ వసతి గృహాలకు సరిపడా గ్యాస్ సరఫరా చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హైదరాబాద్‌కు నెట్‌ఫ్లిక్స్‌ వచ్చిందంటే.. హాలీవుడ్ వచ్చినట్లే: సీఎం రేవంత్‌రెడ్డి

ఢిల్లీ మద్యం కేసు.. కవితకు సీబీఐ నోటీసులు

ప్రజాప్రతినిధులు అభివృద్ధి పనులపై దృష్టి సారించాలి: మంత్రి పొంగులేటి

Read Latest International News And Telangana News And AP News And Telugu News

Updated Date - Mar 13 , 2026 | 01:27 PM